‘నూవొద్దు.. నీ చెల్లెలితో కాపురం చేస్తా’ అన్న భర్తకు మహిళా సంఘాల సాయంతో దేహశుద్ధి చేసిన భార్య

కీచక భర్తకు దేహశుద్ది చేస్తున్న మహిళా సంఘాలు

సహన శీలి అయిన ఆ మహిళ.. చాలా కాలం పాటు వేచి చూసింది. తన భర్తలో మార్పు వస్తుందేమోనని వేచి చూసింది. సంసారాన్ని రోడ్డు మీదకు తీసుకురావడమెందుకని భావించి.. భర్త సూటి పోటి మాటలతో వేధిస్తున్నా భరించింది. కానీ ఆ కీచక భర్తలో మార్పు రాలేదు...

  • News18
  • Last Updated :
  • Share this:
    బ్రతికినన్ని రోజులు నీతోనే ఉంటాన‌ని బాస‌లు చేసి పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్ల‌లు పుట్టిన త‌రువాత నువ్వు వ‌ద్దు అన్నాడు. నీ చెల్లెలు కావాలి.. నీ చెల్లెలిని తీసుకువ‌స్తేనే ఇంట్లోకి రా.. లేదంటే నూవ్ నాకు అవ‌స‌రం లేద‌ని నలుగురు పిల్ల‌ల‌తో పాటు భార్య‌ను ఇంటి నుంచి త‌రిమేశాడు. అయినా సహన శీలి అయిన ఆ మహిళ.. చాలా కాలం పాటు వేచి చూసింది. తన భర్తలో మార్పు వస్తుందేమోనని వేచి చూసింది. సంసారాన్ని రోడ్డు మీదకు తీసుకురావడమెందుకని భావించి.. భర్త సూటి పోటి మాటలతో వేధిస్తున్నా భరించింది. కానీ ఆ కీచక భర్తలో మార్పు రాలేదు సరికదా.. వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో విసిగి పోయి ఆమె.. మ‌హిళ సంఘాల స‌హకారంతో అతడికి దేహశుద్ది చేసింది.

    నిజామాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని విద్యుత్ నగర్ కు చెందిన గల్ఫ్ ఏజెంట్ కృష్ణ కు.. 2001లో హ‌రిక‌తో వివాహం జరిగింది. ఆ దంపతులకు ముగ్గురు ఆడ‌పిల్ల‌లు, ఒక బాబు ఉన్నారు. రెండేళ్ల క్రితం భార్య చెల్లెలి పై కన్నేసిన కృష్ణ.. ఆమెను బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె ఒక నెల రోజులు కాపురం చేసి తర్వాత కృష్ణ‌ను వ‌దిలించుకోని వెళ్లి పొయింది.

    దీంతో కృష్ణ మొదటి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. చెల్లెలిని కాపురానికి తీసుకురావాలని ఆమెను వేధించాడు. చెల్లెలు రాకపోవతే తాను కూడా ఇంట్లో ఉండొద్దని హెచ్చరించాడు. పలుమార్లు ఇదే విషయం మీద ఆమెపై దాడి చేశాడు. ఎంతకూ తన మాట వినడం లేదనే ఆగ్రహంతో.. మొద‌టి భ్యార‌ను కొట్టి పుట్టింట్లో వ‌దిలేసాడు. తర్వాత ఆమె ఎప్పుడు వ‌చ్చిన కొట్టి త‌రిమేసేవాడు.



    దీంతో కృష్ణ మొదటి భార్య అయిన హారిక మహిళా సంఘాలను ఆశ్రయించింది. తన పరిస్థితిని వారికి వివరించింది. తన భర్త మనసు మార్చాలని వేడుకుంది. వారితో కలిసి కృష్ణ ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. రెండో భార్య సైతం తనను బలవంతంగా పెళ్లి చేసుకున్న కృష్ణ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.పెళ్లి పేరుతో మహిళల జీవితాల తో ఆడుకుంటున్న కృష్ణ తీరు పై మహిళా సంఘలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నినాళ్లు వేచి చూసినా కృష్ణలో మార్పు రాకపోవడంతో ఇక దేహశుద్దికి దిగారు మహిళా సంఘాల నేతలు. వందలాది మంది ఇంటికి వచ్చి.. ఆ కీచక భర్తకు బుద్ది చెప్పారు. ఈ ఘటన నగరంలో స్వల్ప ఉద్రిక్తత కు దారి తీసింది. కొద్దిసేపటి తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరు పక్షాలను శాంతపరిచారు. అనంతరం కృష్ణకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
    Published by:Srinivas Munigala
    First published: