భర్త కళ్లల్లో కారంకొట్టి నరికి చంపిన భార్య.. పెద్దపల్లిలో దారుణం

భర్త కళ్లలో కారం కొట్టి, అనంతరం మెడ, కాళ్లు, చేతులపై విచక్షనా రహితంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో చంద్రయ్య అక్కడికక్కడే చనిపోయాడు. భర్తను చంపిన తర్వాత సుగుణమ్మ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.

news18-telugu
Updated: October 11, 2019, 7:24 PM IST
భర్త కళ్లల్లో కారంకొట్టి నరికి చంపిన భార్య.. పెద్దపల్లిలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 11, 2019, 7:24 PM IST
మద్యానికి బానిసైన భర్తను దారుణంగా చంపింది భార్య. కట్టుకున్న భర్తను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.... జవహర్ నగర్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రయ్య, భాగ్యమ్మ భార్య భర్తలు. చంద్రయ్య సింగరేణి కాలరీస్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఐతే మద్యానికి బానిసైన చంద్రయ్య నిత్యం భార్యను వేధించేవాడు. అంతేకాదు ఆమెను అనుమానిస్తూ చిత్రహింసలు పెట్టేవాడు. భర్త వేదింపులను తట్టుకోలేకపోయిన సుగుణమ్మ శుక్రవారం అతడిపై కత్తితో దాడి చేసింది.

భర్త కళ్లలో కారం కొట్టి, అనంతరం మెడ, కాళ్లు, చేతులపై విచక్షనా రహితంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో చంద్రయ్య అక్కడికక్కడే చనిపోయాడు. భర్తను చంపిన తర్వాత సుగుణమ్మ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. తన భర్త వేధింపులను తట్టుకోలేక చంపేశానని వెల్లడించింది. ఐతే మృతుడి బంధువులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మద్యం తాగడం సమస్య కాదని.. ఇంకేదో కారణముందని పోలీసులకు చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుగుణమ్మ విచారణలో హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. కాగా, వీరి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

వీడియో ఇక్కడ చూడండి:First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...