తెల్లవారుజామున 3.30కు తల్లీకొడుకు, ముగ్గురు కలసి.... బయటపెట్టిన ఆకాశరామన్న ఉత్తరం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం సమాజంలో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో ఏకంగా దారుణాలకు ఒడిగడుతున్నారు. కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

 • Share this:
  ప్రస్తుతం సమాజంలో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో ఏకంగా దారుణాలకు ఒడిగడుతున్నారు. కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల బెంగళూరులో ఓ వ్యాపారి చనిపోయారు. చెప్పుల కంపెనీ యజమాని అయిన మొహమ్మద్ హంజాలా నిద్రలోనే కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయినట్టు కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో అంతా అయ్యోపాపం అనుకున్నారు. ఫిబ్రవరి 10న ఈ ఘటన జరిగింది. బంధువులు వచ్చారు. అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అంతా అయిపోయింది. అయితే, అనుకోకుండా పోలీసులకు ఓ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. దాంట్లో ఏముందంటే.. మొహమ్మద్ హంజాలా గుండెపోటుతో చనిపోలేదని.. అతడు హత్యకు గురయ్యాడని అందులో రాసి ఉంది.

  ఆకాశరామన్న ఉత్తరాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. హంజాలా ఇంటికి వెళ్లి విచారించగా, అతను చనిపోయిన వార్త నిజమేనని ధ్రువీకరణ అయింది. ఎలా చనిపోయాడని గట్టిగా నిలదీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడిని హత్య చేసినట్టు మొహమ్మద్ హంజాలా తన భార్య సర్వరి బేగం, కుమారుడు రెహ్మాన్ ఒప్పుకొన్నారు. అసలు అతడిని ఎందుకు చంపారంటూ పోలీసులు ప్రశ్నించగా, అసలు విషయం చెప్పారు.

  హంజారా తన భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు ఇతరులతో లైంగిక సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసేవాడు. దీంతో వేధింపులు భరించలేక అతడిని చంపేయాలని అనుకుంది. ఈ విషయం కొడుకు రెహ్మాన్ కి చెప్పింది. అతడు కూడా తల్లికి మద్దతు పలికాడు. తండ్రిని చంపేయడానికి ప్లాన్ చేశారు. అందుకోసం హంతకులతో బేరం మాట్లాడారు. సుపారీ ఇచ్చారు. రూ.98,000 డీల్ కుదిరింది. అయితే, అతడిని ఎలా చంపాలనేదానిపై అంతా కలసి మాట్లాడుకున్నారు. బయట హత్య చేస్తే తెలిసిపోతుందని హత్యకుఇంట్లోనే పథకం పన్నారు.

  ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపి భర్త హంజారాకు వడ్డించింది బేగమ్. అతడు బోజనం చేసి నిద్రపోయాడు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హంతకులు ఇంటికి వచ్చి అతడిని మంచం మీద నిద్రపోతున్న వ్యక్తిని ముఖంపై దిండు అదిమి హత్య చేశారు. హంజారా భార్య, కొడుకు, మరో ముగ్గురు కలసి ఈ దారుణానికి ఒడిగట్టారు. తెల్లవారిన తర్వాత అయ్యో అయ్యో రాత్రి గుండెపోటుతో చనిపోయాడని చుట్టుపక్కల వారికి చెప్పారు. అయితే, ఓ ఆకాశరామన్న ఉత్తరంతో మొత్తం బండారం బయటపడింది. ఈ కేసులో ముగ్గురు హంతకులు, తల్లీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: