హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు.. నిండు గర్భంతో భార్య.. బావిలో పడి భర్త మృతి.. అంత్యక్రియలుకు డబ్బులేక..

ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు.. నిండు గర్భంతో భార్య.. బావిలో పడి భర్త మృతి.. అంత్యక్రియలుకు డబ్బులేక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తన భర్త అంత్యక్రియల రోజు చేతిలో డబ్బులు లేకపోతే తెలిసిన వారు అప్పుగా ఇఛ్చారు. ఇటీవల వారు వచ్చి డబ్బులు ఇవ్వాలని అడిగారు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన మెడలోని బంగాలు గొలుసును తాకట్టు పెట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Siddipet

(కే. వీరన్న, న్యూస్18 తెలుగు, మెదక్ జిల్లా)

వారికి పదేళ్ల క్రితం వివాహమైంది. పేద కుటుంబమైనా.. భర్త బాగా చూసుకోవడంతో.. ఆ ఇల్లాలు ఎంతో సంతోషంగా ఉండేది. భార్యాభర్తలు సుఖ సంతోషాలతో జీవించేవారు. కానీ కరోనా వచ్చాక.. వారి జీవితం తలకిందులయింది. కరోనా సమయంలో పుట్టిన ఆడపిల్ల..సరైన చికిత్స అందక.. పుట్టిన ఆరు నెలలకే మరణించింది. ఆ బాధను మర్చిపోయేలా ఆమె మళ్లీ గర్భం దాల్చింది. నెల రోజుల్లో బిడ్డకు జన్మనిస్తున్నాననే సంతోషంలో ఉండగా... ఊహించని రీతిలో భర్త మృత్యువాతపడ్డాడు. కడుపులో బిడ్డ కన్ను తెరిచేలోగా... భర్త తనువు చాలించడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగింది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో భర్త కట్టిన తాళిబొట్టును తాకట్టు పెట్టి అంత్యక్రియలు జరిపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

దౌల్తాబాద్ మండలంలోని లింగాయపల్లి తండాకు చెందిన బానోతు లక్ష్మి దయ నీయ కథ ఇది. ఆమె భర్త బానోతు వాగ్యా మేకలు కాసేవాడు. వాటితో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆమె భార్య లక్ష్మి ఆయనకు చేదోడుగా కూలీకి వెళ్లేది. ఈ ఏడాది ఆగస్టు 19న ఊరి బయటకు వెళ్లిన వాగ్యా అనుమానాస్పద రీతిలో బావిలో పడి చనిపోయాడు. అప్పుడు లక్ష్మి ఎనిమిది నెలల గర్భవతి. గతనెల 22న పండంటి బాబుకు ఆమె జన్మనిచ్చింది. ప్రసవం కష్టం కావడంతో పెద్దాపరేషన్ చేయక తప్పలేదు. దీంతో ఆమె కనీసం తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి.75 ఏళ్ల వయసున్న ఆమె అత్త పూరి ఇప్పుడు కూలీకి వెళ్లి నాలుగు పైసలు తెస్తే తప్ప ఇల్లు గడవడం లేదు. సరైన తిండి లేక కడుపునిండా బిడ్డకు పాలు ఇవ్వలేక పోతున్నానని లక్ష్మి విలపిస్తూ చెప్పుకొచ్చింది. తనకు వృద్ధురాలైన అత్త తప్ప ఇంకెవరూ లేరంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే రూ.3 లక్షల వరకు అప్పులున్నాయని కన్నీళ్లు పెట్టుకుంది.

Bhadradri: చాప కింద నీరులా విస్తరిస్తున్న గుడుంబా.., పేదల బతుకుల్లో చిచ్చు

తన భర్త అంత్యక్రియల రోజు చేతిలో డబ్బులు లేకపోతే తెలిసిన వారు అప్పుగా ఇఛ్చారు. ఇటీవల వారు వచ్చి డబ్బులు ఇవ్వాలని అడిగారు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన మెడలోని బంగాలు గొలుసు, తాళి తాకట్టు పెట్టి రూ.60వేలు వారికి ఇచ్చానని చెప్పింది. ఇప్పుడు రోజు గడవడం కష్టంగా ఉందంటూ కన్నీటి పర్యంతమయింది. లక్ష్మి భర్త.. బానోతు వాగ్యాకు 10 గుంటల భూమి ఉంది. కానీ రికార్డుల్లోకి ఎక్కించడంలో జాప్యం వల్ల బీమాకు అర్హత సాధించ లేదు. దాంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని చెప్పింది. తమ కుటుబాన్ని ఆదుకొని.. ఆర్థిక సాయం చేయాలని ఆమె కోరుతోంది. దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.

First published:

Tags: Crime, Crime news, Siddipet, Telangana