Home /News /crime /

WIFE SMILE REVEALS THE WHOLE TRUTH BEHIND THE MATTER INCIDENT HAPPENED IN SIVAGANGA DISTRICT TAMILNADU SSR

Wife Smile: భర్త చనిపోయిన 15 రోజులకే ఎవరితోనో భార్య ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించేసరికి..

దేవేంద్రన్, చంద్రశేఖరన్, సూర్య

దేవేంద్రన్, చంద్రశేఖరన్, సూర్య

దేవేంద్రన్ చనిపోయిన 15 రోజుల తర్వాత అతని తమ్ముడు సతీష్ దేవేంద్రన్ భార్యను చూసి షాకయ్యాడు. ఒంటరిగా ఉన్న ఆమె ఎవరితోనో ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతూ ఉండటాన్ని గమనించాడు.

    చెన్నై: ఈ ఫొటోలో కాస్త వయసు మీదపడినట్లు కనిపిస్తున్న వ్యక్తి పేరు దేవేంద్రన్(46). తమిళనాడులోని శివగంగ జిల్లా దేవకొట్టై తాలూకాలోని సదయంకాడు అనే గ్రామానికి చెందిన దేవేంద్రన్ డీఎంకే బ్రాంచ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య పేరు సూర్య. ఈ దంపతులకు పిల్లలు లేరు. గతేడాది నవంబర్ నుంచి దేవేంద్రన్ అనారోగ్యం బారిన పడ్డాడు. జాండీస్‌తో పాటు కిడ్నీలు పాడవడంతో తరచుగా హాస్పిటల్స్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

    ఇది కూడా చదవండి: HouseWife: ఈమె భర్తకు వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది.. అది ఎవరు పంపారో చూసి ఈమె షాక్.. చివరికి..

    గతేడాది డిసెంబర్ 15న తిరుచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న దేవేంద్రన్ కోలుకుని డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లాడు. మళ్లీ ఈ ఏడాది జనవరి 4న దేవేంద్రన్ అస్వస్థతకు గురి కావడంతో మళ్లీ అదే హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం తిరుచ్చిలోని కావేరీ హాస్పిటల్‌కు తరలించాలని సూచించారు. దీంతో.. కుటుంబ సభ్యులు అతనిని కావేరీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ జనవరి 6న దేవేంద్రన్ చనిపోయాడు.

    ఇది కూడా చదవండి: Medical Shop: మెడికల్ షాపు నడుపుతున్నావ్.. మందులు అమ్ముకోకుండా ఇదేం పని.. ఇప్పుడేమైందో చూడు..

    తీవ్ర మనోవేదనకు గురైన అతని కుటుంబ సభ్యులు దేవేంద్రన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. దేవేంద్రన్ చనిపోయిన 15 రోజుల తర్వాత అతని తమ్ముడు సతీష్ దేవేంద్రన్ భార్యను చూసి షాకయ్యాడు. ఒంటరిగా ఉన్న ఆమె ఎవరితోనో ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతూ ఉండటాన్ని గమనించాడు. భర్త చనిపోయి 15 రోజులు కూడా కాకముందే ఆమె అంత ఆనందంగా నవ్వుతూ ఉండటం, పైగా.. ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ నవ్వుతుండటంతో అతనికి ఆమె ప్రవర్తనపై అనుమానమొచ్చింది. దీంతో.. దేవేంద్రన్ భార్య సూర్యకు తెలియకుండా ఆమె ఇంటికి వెళ్లిన క్రమంలో సతీష్ ఆమె సెల్ ఫోన్‌ను సీక్రెట్‌గా చెక్ చేశాడు. అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్ అనే వ్యక్తితో ఆమె తరచుగా మాట్లాడినట్లు కాల్ లిస్ట్ ఆధారంగా గమనించాడు. దేవేంద్రన్ ఇంట్లో చంద్రశేఖరన్ అనే వ్యక్తి దాదాపు 15 ఏళ్ల పాటు పనిచేశాడు. ఈ విషయం సతీష్‌కు కూడా తెలుసు.



    దీంతో.. ఇద్దరి మధ్య ఏదో నడిచిందని భావించిన సతీష్ తన అన్న అనారోగ్యంతో చనిపోలేదని.. చంద్రశేఖరన్‌పై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రశేఖరన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం అప్పుడు బయటపడింది. దేవేంద్రన్ భార్య సూర్య, చంద్రశేఖరన్ మధ్య వివాహేతర సంబంధం నడిచింది. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన సూర్య ప్రియుడితో కలిసి తెలివిగా దేవేంద్రన్ హత్యకు ప్లాన్ చేసింది.

    ఇది కూడా చదవండి: Government Teacher: గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ఇదేం పని బాబూ.. ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడో చూడండి..

    లివర్ డ్యామేజ్ సమస్య నుంచి కోలుకున్న దేవేంద్రన్‌కు భార్య రోజూలానే అన్నం వడ్డించి సాంబార్ పోసింది. అయితే.. ఆ సాంబార్‌లో ఎలుకల మందు కలిపింది. ఆ విషయం తెలియక అది తిన్న దేవేంద్రన్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఈ కేసులో చంద్రశేఖరన్‌తో పాటు సూర్యను కూడా అరెస్ట్ చేశారు. సాంబారులో ఎలుకల మందు కలిపి భర్తను చంపిందన్న విషయం తెలిసి ఇరుగుపొరుగు ఉలిక్కిపడ్డారు. చనిపోయిన వ్యక్తి డీఎంకే నేత కూడా కావడంతో స్థానికంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Chennai, Crime news, Extra marital affair, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు