గర్భిణీపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త, అత్త..తెలంగాణలో దారుణం

ఇష్టంలేని పెళ్లి చేశారని, అదనపు కట్నం తేవాలని సీతాలుకు భర్త నుంచి వేధింపులు పెరిగాయి. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్రశాంత్ ప్లాన్ చేశాడు. చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని కుట్ర చేశారు.

news18-telugu
Updated: May 24, 2019, 9:33 PM IST
గర్భిణీపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త, అత్త..తెలంగాణలో దారుణం
ఇష్టంలేని పెళ్లి చేశారని, అదనపు కట్నం తేవాలని సీతాలుకు భర్త నుంచి వేధింపులు పెరిగాయి. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్రశాంత్ ప్లాన్ చేశాడు. చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని కుట్ర చేశారు.
news18-telugu
Updated: May 24, 2019, 9:33 PM IST
వరకట్నం నిషేధంపై చట్టాలున్నా...కట్న పిశాచాలు చెలరేగుతూనే ఉన్నాయి. అదనపు కట్నం కోసం కోడళ్లను చిత్రవధకు గురిచేస్తున్నాయి. డబ్బు కోసం కట్టుకున్న భార్యను చంపుకుంటున్నారు రాక్షస భర్తలు. కోడలిని కూతురిలా చూడకుండా డబ్బిచ్చే యంత్రాల్లా పరిగణిస్తున్నారు కిరాతక అత్తలు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం జరిగింది. ఆరు నెలల గర్భిణిపై భర్త, అత్త, మరిది కలిసి కిరోసిన్ పోసి నిప్పటించారు.

బోధన్‌లోని రాకాసిపేటలో నివసిస్తున్న ప్రశాంత్, సీతాలు దంపతులకు గత ఏడాది పెళ్లయింది. ప్రస్తుతం సీతాలు ఆరు నెలల గర్భవతి. పెళ్లైన నెల రోజుల వరకు వీరి కాపురం సజావుగా సాగింది. భార్యను బాగానే చూసుకున్నాడు ప్రశాంత్. కళ్యాణ లక్ష్మి చెక్కు ఎప్పుడైతే చేతిలో పడిందే.. ఆ మరుక్షణం నుంచి అత్తింటి కష్టాలు మొదలయ్యాయి. ఇష్టంలేని పెళ్లి చేశారని, అదనపు కట్నం తేవాలని సీతాలుకు భర్త నుంచి వేధింపులు పెరిగాయి. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్రశాంత్ ప్లాన్ చేశాడు. చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని కుట్ర చేశారు.

ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సీతాలుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ప్రశాంత్. అనంతరం సీతాలు ఆత్మహత్యకు యత్నించిందని చెప్పి..నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె మంటల్లో కాలిపోవడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సీతాలును ఆస్పత్రిలో చేర్పించాక భర్త, అత్త పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసిన దర్యాప్తుచేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...