తనతో కలిసి మద్యం సేవించలేదని...భార్యను ఏం చేశాడంటే...

ఇంతలో బజారు నుంచి ఇంటికి వచ్చిన రాణిని చూసి మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఎక్కడి వెళ్లావంటూ అనుమానంతో ఆమెను శారీరకంగా హింసించాడు. ఇంతలో తనతో పాటు కూర్చొని మందు కొట్టాలని కోరిక కోరాడు.

news18-telugu
Updated: October 30, 2019, 4:18 PM IST
తనతో కలిసి మద్యం సేవించలేదని...భార్యను ఏం చేశాడంటే...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తనతో కలిసి మద్యం తాగలేదనే కోపంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త, వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో మనోజ్ (పేరు మార్పు) తన భార్య రాణి (పేరు మార్పు)తో కలిసి జీవిస్తున్నాడు. అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. మనోజ్ మద్యం సేవించే అలవాటు ఉండటంతో నిందితుడు మనోజ్ తన భార్య రాణిని వేధింపులకు గురిచేసేశాడు. ఈ క్రమంలోనే గత వారం మనోజ్ ఇంట్లో మద్యం సేవించడం ప్రారంభించాడు. ఇంతలో బజారు నుంచి ఇంటికి వచ్చిన రాణిని చూసి మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఎక్కడి వెళ్లావంటూ అనుమానంతో ఆమెను శారీరకంగా హింసించాడు. ఇంతలో తనతో పాటు కూర్చొని మందు కొట్టాలని కోరిక కోరాడు. అందుకు ఆమె తిరస్కరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మనోజ్ వెంటనే మద్యం సీసా బద్దలు కొట్టి ఆమెను గాయపరచాలని ప్రయత్నించాడు.

దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చి తలుపుమూసి గొళ్లెం పెట్టి, చుట్టు పక్కల వాళ్లనుపిలిచింది. దీంతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన రాణిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

First published: October 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>