అనంతలో దారుణం... వాతలు పెట్టి భార్యపై స్నేహితుడితో అత్యాచారం

స్నేహితుడితో కలిసి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త, భార్యను మంచానికి కట్టేసి, స్నేహితుడితో అత్యాచారం చేయించాడు. అంతటితో ఆగకుండా అట్లకాడతో చెప్పుకోలేని చోట వాతలు పెట్టాడు.

news18-telugu
Updated: December 4, 2019, 9:07 AM IST
అనంతలో దారుణం... వాతలు పెట్టి భార్యపై స్నేహితుడితో అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓవైపు దేశమంతా ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలపై మండిపడుతుంటే... కొందరు కామాంధులు మాత్రం ఇవేం పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు. దిశా ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బాలికలు, మహిళలు, వృద్ధుల పట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అనంతలో మరో కీచకుడు రెచ్చిపోయాడు. ఏడుజన్మల వరకు తోడుగా నీడగా ఉంటానంటూ అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తే  కట్టుకున్న భార్యపైనే తన పైశాచికత్వం ప్రదర్శించాడు. భార్యపై అనుమానం పెంచుకున్న ఆ మృగాడు స్నేహితుడిని ఇంటికి పిలిచి భార్యపై మానభంగం చేయించాడు.అంతటితో ఆగకుండా దారుణాతి దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కదిరిలో కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణ పరిధిలోని సోమేష్‌ నగర్‌ లో దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే భర్తకు తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో గత నెల 29న తన స్నేహితుడితో కలిసి పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త, భార్యను మంచానికి కట్టేసి, స్నేహితుడితో అత్యాచారం చేయించాడు. అంతటితో ఆగకుండా అట్లకాడతో చెప్పుకోలేని చోట వాతలు పెట్టాడు.

దీంతో ఆమె, తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోనిది కాదని, కదిరిలోనే ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. బాధితురాలి ఫిర్యాదును అందుకున్న కదిరి రూరల్ పోలీసులు విచారణ ప్రారంభించి, చికిత్స నిమిత్తం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  అయితే గతంలో బాధితురాలి భర్త బాలికపై అత్యాచారం చేసి,  జైలుశిక్షను కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు.భర్త, అతని స్నేహితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 4, 2019, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading