Home /News /crime /

WIFE POURS HOT WATER ON HIS HUSBAND PRIVATE PARTS SHOCKING INCIDENT FROM TAMILNADU SK

పర స్త్రీతో వివాహేతర సంబంధం.. కోపంతో భర్త ప్రైవేట్ పార్ట్స్‌పై వేడి నీళ్లు పోసిన భార్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అర్ధరాత్రి తర్వాత నిద్రలేచిన ప్రియ.. స్టవ్‌పై ఓ గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసింది. బాగా మరిగిన తర్వాత.. ఆ వేడి నీటిని తీసుకొని భర్త మర్మాంగాలపై పోసింది. మరుగుతున్న నీరు పడడంతో శరీర భాగాలు కాలిపోయాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. భార్యా భర్తలు విడిపోవడానికి, ఒకరినొకరు చంపుకోవడానికి కారణమవుతున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా తమిళనాడు (Tamilnadu)లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. తన భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. భర్త మర్మాంగాలపై మరుగుతున్న నీటిని పోసి.. పగ తీర్చుకుంది. తీవ్ర గాయాలతో అతడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

    స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. రాణిపేట జిల్లా కావేరిపాక్కంకు చెందిన ఎల్. తంగరాజ్ (32), టి. ప్రియ (29) భార్యాభర్తలు.  వీరికి ఇద్దరు పిల్లలున్నారు.  తంగరాజ్ శ్రీపెరంబుదూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన పనిచేస్తున్నాడు. వీరిద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు. కానీ కొన్ని రోజులుగా తంగరాజ్ ప్రవర్తనలో మార్పును ప్రియ గమనించింది. తన భర్తకు వేరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని  తెలుసుకుంది. ఈ క్రమంలోనే అతడిపై కోపం పెంచుకుంది. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. నువ్వు చేస్తుంది కరెక్టు కాదని.. ఆమెతో సంబంధాన్ని తెంచుకోవాలని ఎన్నోసార్లు చెప్పింది. కానీ తంగరాజ్ మారలేదు. దాంతో భర్తపై కోపం పెంచుకుంది ప్రియ.

    సోమవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కాసేపు వాగ్వాదం అనంతరం ఇద్దరూ నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత నిద్రలేచిన ప్రియ.. స్టవ్‌పై ఓ గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసింది. బాగా మరిగిన తర్వాత.. ఆ వేడి నీటిని తీసుకొని భర్త మర్మాంగాలపై పోసింది. మరుగుతున్న నీరు పడడంతో శరీర భాగాలు కాలిపోయాయి. నొప్పితో తంగరాజ్ విలవిల్లాడాడు. అతడి అరుపులను విని చుట్టుపక్కల వారు నిద్రలేచారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మొదట స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించాారు. అతడి ప్రైవేట్ పార్ట్స్ 50శాతం కాలిపోయాయని.. మెరుగైన వైద్య చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పారు. ఈ క్రమంలోనే వేలూరులో ఉన్న మరో పెద్దాస్పత్రికి ఆయన్ను షిప్ట్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.



    కావేరిపాక్కం పోలీసులు తంగరాజ్ భార్య ప్రియను అరెస్ట్ చేశారు. ఆమె సెక్షన్లు 294 (బి), 324 , 506 కింద కేసు నమోదు చేశారు. తన భర్త వేరొక మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతోనే ఇలా చేశానని ప్రియ తన నేరాన్ని అంగీకరించింది. క్షణికావేశంలో అది జరిగిపోయిందని తెలిపింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Tamilanadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు