Home /News /crime /

WIFE POUR HEATED OIL ON HUSBAND INTERNAL PARTS IN VIJAYANAGARAM VRY

Crual wife : భార్యభర్తలు గొడవ పడ్డారు... ఆ తర్వాత భార్య దారుణం చేసింది...భర్త మర్మాంగాలపై..వేడి వేడి...

oil

oil

Crual wife : ఇష్టం లేని భర్తపై దారుణానికి పాల్పడింది ఓ భార్య.. అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్త మర్మాంగాలపై వేడి వేడి నూనే పోసింది. దీంతో ఆ భర్త ఆసుపత్రి పాలయ్యాడు.

    సైకో భర్తలను చాలామందిని చూశాం. భార్యలను చిత్రహింసలకు గురి చేయడం అనంతరం వాటిని వీడియోలు కూడా తీసుకోవడం లాంటీ సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.. చివరకు వారి సైకోయిజంతో నిర్ధాక్షిణ్యంగా చంపిన భర్తలు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే ఓ భర్త నిద్రిస్తున్న తన భార్య తలను నరికి ఆ తలను తీసుకుని ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లిన పరిస్థితి వెలుగు చూసింది.

    కాని ఇటివల భార్యలే భర్తలను చిత్రహింసలకు గురి చేస్తున్న సంఘటనలు వెలుగు ఓ భార్య భర్తను ఇటివల వెలుగు చూస్తున్నాయి.. మంచిర్యాల జిల్లాలో ఓ భార్య తన భర్తను అనేక సార్లు చిత్రహింసలకు గురి చేసింది. ఫోన్ మాట్లాడినా.. బయటి నుండి ఇంటికి ఆలస్యంగా వచ్చినా విపరీతంగా కొట్టేది.ఇలా భార్య దెబ్బలకు తట్టుకోలేక ఆ భర్త ఏకంగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంది.

    కాగా తాజాగా ఏపీలో భర్తను చిత్రహింసలకు గురి చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఇద్దరు భార్య భర్తల మధ్య వివాదంతో ఆ భర్త మర్మాంగాలపై ఏకంగా వేడి నూనే పోసి ఆసుపత్రి పాలు చేసింది. నిద్రలో ఉన్న భర్తపై వేడి నూనే పోసిన ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది.

    Forgery case : కోర్టునే బురిడి కొట్టిస్తున్న గ్యాంగ్.... ఐదుగురు సభ్యుల అరెస్ట్..!


    వివరాల్లోకి వెళితే...విజయనగరం ఎస్ కోట మండలం వెంకటరమణపేట గ్రామానికి చెందిన గంగునాయుడు, సత్యవతికి నాలుగేళ్ళ క్రితం 2017లో వివాహం జరిగింది. కాగా సత్యవతికి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయిన తల్లిదండ్రుల బలవంతంతో పెళ్లి చేసుకుంది. కాని ఆమెకు భర్త ఇష్టం లేకపోవడంతో... తరచు ఘర్షణ పడేది. దీంతో నిత్యం ఇలా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా ఎప్పటిలాగే..నిన్న రాత్రి పదిగంటలకు కూడా ఇద్దరి మధ్య గొడవలు జరుగాయి. ఆ తర్వాత అందరు నిద్రపోయారు. కానీ భార్య సత్యవతికి మాత్రం భర్తపై కోపం తీవ్రంగా పెరిగింది. తరుచు గొడవలు పడడంతో పాటు ఎలాగైనా భర్తపై కసి తీర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది...

    KTR : వరంగల్‌లో జెన్‌ప్యాక్ట్... హైదరాబాద్‌లో పెట్‌కేర్ మరో 500 కోట్ల పెట్టుబడి..


    దీంతో నిన్న అర్ధరాత్రి నిద్ర లేచి ఇంట్లో ఉన్న వంటనూనెను వేడి చేసింది.. బాగా మరిగిన తరువాత వేడి నూనెను నిద్రిస్తున్న భర్త మర్మాంగాలపై పోసింది.ఇంకేముంది మాములుగా వేడి నూనే శర్మంపై పడితే ప్రాణాలు గాల్లో పరిస్థితి ఉంటుంది. అలాంటిది సున్నిత భాగంపై నూనే పోయడంతో పెద్దగా కేకలు పెట్టడడంతో చుట్టుపక్కల వారు చేరుకుని ఆయన్న ఆసుపత్రికి తరలించారు. కాగా గంగునాయుడు పరిస్థితి విషమంగా మారిందని చెబుతున్నారు..దీంతో విషయం పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Vijayanagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు