ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh) నోయిడాలో దారుణం జరిగింది. ఒక మహిళ తన రెండో భర్త మీద కు తెలియకుండా మరో పెళ్లైన వ్యక్తితో ఎఫైర్ (Affair) పెట్టుకుంది. రిషిపాల్ శర్మ, పూజ సింగ్ ఇద్దరు భార్య భర్తలు. వీరు నోయిడాలో ఉంటున్నారు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. (Second marriage) ఈ క్రమంలో పూజసింగ్ ఆస్పత్రిలో పనిచేసేది. ఈ క్రమంలో అఖీల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర (Extra marital affair) సంబంధానికి కారణమైంది.
పూజసింగ్ కు మొదటి భర్తతో ఉన్నప్పుడు విశాల్ సింగ్ పుట్టాడు. ఈ క్రమంలో మొదటి భర్తలో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత.. రిషిపాల్ ను రెండో పెళ్లి చేసుకుంది. కాగా, రెండో భర్త అడ్డును తొలగించుకుని ఆస్తికి (Property) నొక్కెయాలని పూజ సింగ్, తన కొడుకుతో కలిసి ప్లాన్ వేశారు. తన ప్రియుడు అఖీల్ కు, పూజ చెప్పింది. దీంతో వారు.. ఫ్రొఫెషనల్ షూటర్ హసన్ ను దీని కోసం రెడీ చేసుకున్నారు. రిషిపాల్ శర్మ.. ఆఫీస్ నుంచి తన ఇంటికి వస్తుండగా.. మే 10 న ఇద్దరు దుండగులు.. సెక్టార్ 126 వద్ద కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడిక్కడే చనిపోయాడు.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరిని అనుమానస్పదంగా ఉండటంతో వారిని అదుపులోనికి తీసుకొని విచారించారు. దీంతో ఈ మాస్టర్ ప్లాన్ రెండో భార్య, అతని కుమారుడు, ప్రియుడి దేనని విషయం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ లో (Delhi) సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటన కల్కాజీ ప్రాంతంలో మే 14 జరిగింది. కల్కాజీలో ఒక అపార్ట్ మెంట్ లో దంపతులు ఉండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరికి మధ్య తరచుగా గొడవలు జరుగుతు ఉండేవి. దీంతో స్వర్ణాలి ఘోష్ తన భర్త మీద పీకలదాక కోపం పెంచుకుంది. అప్పటికే స్వర్ణాలి ఘోష్.. భర్తకు తెలియకుండా మోహన్ పాల్ తో రెండెళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.
ఈ క్రమంలో తన ప్రియుడికి (Lover) భర్త వేధింపులను చెప్పింది. దీంతో ఇద్దరు కలిసి అతడిని హతమార్చాలని ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా ఇంట్లో ఉన్న వ్యక్తిపై, భార్య, స్వర్ణాలి ఘాష్, మోహన్ పాల్ కత్తితో దాడిచేశారు. ఆమె కదలకుండా గట్టిగా పట్టుకుంటే ప్రియుడు, వివాహిత భర్తను హత్య చేశాడు. ఆ తర్వాత.. మోహన్ పాల్ వెస్ట్ బెంగాల్ పారిపోయాడు. అయితే, ఇతని శవాన్ని ఇంటి ముందర పడేశారు. ఎవరో గుర్తు తెలియని దుండుగులు చంపేశారని చెప్పడానికి ప్లాన్ వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Extramarital affairs, Illegal affair, Noida, Uttar pradesh