దిండుతో ఊపిరాడకుండా చేసింది... రోహిత్ తివారి హత్యకేసులో భార్య అపూర్వ అరెస్ట్

భార్య అపూర్వకు ఆస్తి విషయంలో కొడకుతో తగాదాలు ఉన్నట్లు... రోహిత్ తల్లి ఉజ్వల పోలీసులకు తెలిపారు.

news18-telugu
Updated: April 24, 2019, 2:59 PM IST
దిండుతో ఊపిరాడకుండా చేసింది... రోహిత్ తివారి హత్యకేసులో భార్య అపూర్వ అరెస్ట్
రోహిత్ తివారి
  • Share this:
ఎన్డీ తివారి కొడుకు రోహిత్ తివారి హత్య కేసులో కోడలు అపూర్వ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడురోజుల పాటు రోహిత్ భార్య అపూర్వను విచారించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ మరణించిన రాత్రి అతని గదిలోనే అపూర్ ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. తాను ఈ పెళ్లితో ఆనందంగా లేదని పోలీసుల విచారణలో చెప్పింది. గతకొన్ని రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు కూడా పేర్కొంది. రోహిత్ మద్యం మత్తులో ఉన్న సమయంలో అతని ముఖంపై దిండుతో ఒత్తి ఊపిరాడకుండా చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రోహిత్‌ను హత్య చేయడంలో అపూర్వ ఎవరి సాయం కూడా తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 16న తన నివాసంలోనే రోహిత్ శేఖర్ తివారీ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. పోస్టుమార్టమ్ రిపోర్టులో అతనితో హత్యేనని తేలడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దీంతో కేసును క్రైమ్ బ్రాంచీకి ట్రాన్స్‌ఫర్ ‌చేశారు. రోహిత్‌ను ఎవరో బలంగా ఊపిరి ఆడకుండా చేసి, హత్య చేసి ఉంటారని రిపోర్టులో బయటపడింది.

భార్య అపూర్వకు ఆస్తి విషయంలో కొడకుతో తగాదాలు ఉన్నట్లు... రోహిత్ తల్లి ఉజ్వల పోలీసులకు తెలిపారు. సుప్రీంకోర్టు సమీపంలోని తిలక్ రోడ్డులో ఉన్న ఆస్తులు తన పేరు మీద రాయాలని అపూర్వ పట్టుబడిందని ఉజ్వల ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వరుసకు సోదరుడయ్యే రాజీవ్ కుమారుడు కార్తీక్‌కు ఆస్తిలో కొంత భాగం ఇస్తామని రోహిత్ నిర్ణయించుకున్నాడు. దీన్ని అతని భర్య అపూర్వ వ్యతిరేకించిందని రోహిత్ తల్లి ఉజ్వల ఆరోపించారు. ఆస్తి కోసం కోడలే కోడుకును హత్య చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అపూర్వను విచారించారు. త్వరలోనే ఆమెను కోర్టులో కూడా హాజరుపరచనున్నారు పోలీసులు.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు