WIFE OF A BLIND MAN ESCAPED AFTER SEVEN MONTHS OF MARRIAGE IN PUNE WITH CASH AND JEWELLERY AK
Bride: 7 నెలల క్రితం పెళ్లి.. సాఫీగా సాగిపోయిన జీవితం.. హఠాత్తుగా ఊహించని పరిణామం.. బండారం బయటపెట్టిన ఆధార్ కార్డు..
ప్రతీకాత్మక చిత్రం
కొన్నేళ్ల నుంచి అమ్మాయి కోసం వెతికి విసిగిపోయిన వినోద్‌కు అమ్మాయిని వెతికి పెట్టే పెళ్లి చేసే బాధ్యతను మ్యారేజ్ బ్రోకర్ కైలాస్ కుమార్ సింఘ్వీ తీసుకున్నారు. ఇందుకోసం సింఘ్వీకి బాగానే డబ్బులు ఇచ్చాడు వినోద్.
పుణె: ఈ కాలంలో అబ్బాయిలకు పెళ్లి కోసం అమ్మాయిలు దొరకడం కష్టమైపోయింది. ఇందుకోసం అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు. అయితే ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలను వెతికేందుకు డబ్బులు తీసుకుని కొందరు మోసం చేస్తుంటే.. మరికొందరు ఈ విషయంలో మరింత దారుణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి జరిగి జీవితం సాఫీగా సాగిపోతుందని భావిస్తున్న సమయంలో.. ఊహించని విధంగా దెబ్బకొడుతున్నారు. అలాంటి ఓ ఘటన పుణెలోని ఓ వ్యక్తికి ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. పుణెలోని నివాసం ఉంటున్న వినోద్ చౌదరికి రెండు కళ్లు కనిపించవు. అతడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాడు. సాధారణంగా కళ్లు కనిపించని వారికి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం.
వినోద్‌కు కూడా అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. కొన్నేళ్ల నుంచి అమ్మాయి కోసం వెతికి విసిగిపోయిన వినోద్‌కు అమ్మాయిని వెతికి పెట్టే పెళ్లి చేసే బాధ్యతను మ్యారేజ్ బ్రోకర్ కైలాస్ కుమార్ సింఘ్వీ తీసుకున్నారు. ఇందుకోసం సింఘ్వీకి బాగానే డబ్బులు ఇచ్చాడు వినోద్. సుమారు రూ. 9 లక్షల వరకు అతడికి ఇచ్చాడు. ఇక వినోద్‌కు సారిక అనేక అమ్మాయితో పెళ్లి కుదిర్చాడు. ఇందుకోసం సారిక కుటుంబానికి కూడా వినోద్ నుంచి బాగానే డబ్బులు ఇప్పించాడు. వినోద్‌కు సారికకు పెళ్లి జరిగింది. వారి జీవితం సాఫీగా సాగిపోయింది.
అయితే ఏడు నెలల తరువాత వినోద్ జీవితంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి వినోద్ భార్య సారిక ఎక్కడికో వెళ్లిపోయింది. ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్లిపోయిన తన భార్య సారిక గురించి వినోద్ కంగారు పడ్డాడు. వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. అయితే కొద్దిరోజుల్లోనే తాను మళ్లీ తిరిగొస్తానని సారిక వినోద్‌కు చెప్పింది. ఆమె మాటలు నమ్మిన వినోద్.. కొన్ని రోజులు సారిక కోసం ఎదురుచూశాడు. కానీ సారిక తిరిగిరాలేదు. మళ్లీ ఆమెకు ఫోన్ చేస్తే స్విఛాప్ అని వచ్చింది.
అయితే ఇంట్లో రూ. 20 వేలకు పైగా నగదు, నగలను కూడా సారిక తీసుకెళ్లడంతో వినోద్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వివరాలపై దృష్టి పెట్టాడు. ఆమె ఆధార్ కార్డ్ ఆధారంగా వివరాల కోసం వెతికాడు. అప్పుడు కానీ వినోద్‌కు అసలు విషయం తెలియలేదు. ఆ ఆధార్ కార్డు నంబర్ మీద సారిక వివరాలు లేవని తెలుసుకున్న వినోద్.. తాను మోసపోయానని తెలుసుకున్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.