దారుణం.. భర్తను క్రికెట్ బ్యాట్‌తో మర్మాంగాలపై కొట్టి.. కారణం తెలిస్తే షాక్..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ నేపథ్యంలో ట్యాక్సీలు నడవకపోవడం వల్ల రెండు నెలల క్రితం స్వగ్రామం నక్కపల్లికి వచ్చాడు. ఇక్కడే ఉపాధి పనులు చేస్తున్నాడు.

 • Share this:
  భార్యభర్తల మధ్య రోజురోజూకీ సంబంధాలు దిగజారిపోతున్నాయి. చిన్నచిన్న విషయాలకే సహనం కోల్పోతున్నారు. హత్యలు చేయడమో.. ఆత్మహత్యలు చేసుకోవడమో పరిపాటిగా మారింది. వివాహేతర సంబంధాలే కాకుండా ఇంట్లో నిత్యం జరిగే చిన్న చిన్న విషయాలకు పెద్దగా రెస్పాండ్ అవుతున్నారు. ఫలితంగా పచ్చని సంసారాలు రోడ్డున పడుతున్నాయి. అనంతరం కుటుంబ సభ్యులు ఏ దిక్కు లేకుండా అనాథలుగా మారిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య తనను నిత్యం వేధిస్తున్నాడనే కారణంతో భర్త మర్మాంగాలపై క్రికెట్ బ్యాట్‌తో కొట్టి దారుణంగా హత్య చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం నక్కపల్లి గ్రామానికి చెందిన గోపినాథ్ రెడ్డి, సునీత భార్యభర్తలు. వీరికి ఓ కొడుకు(10) ఉన్నాడు. గోపినాథ్ రెడ్డికి అదే గ్రామానికి చెందిన సునీతతో 13 సంవత్సరాల క్రితం వివాహమయ్యింది.

  గతంలో గోపినాథ్ రెడ్డి బెంగళూరులో ట్యాక్సీలను అద్దెకు ఇచ్చేవాడు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ట్యాక్సీలు నడవకపోవడం వల్ల రెండు నెలల క్రితం స్వగ్రామం నక్కపల్లికి వచ్చాడు. ఇక్కడే ఉపాధి పనులు చేస్తున్నాడు. నక్కపల్లిలోని మూడెకరాల భూమిని అమ్మడంతో వచ్చిన సొమ్మును భార్య సునీత, అత్త చంద్రమ్మ తీసున్నారు. అందుకు సంబంధించిన సొమ్మును అడిగినన ప్రతిసారి భార్య సునీత గోపినాథ్ రెడ్డితో గొడవపడేది. ఇలా జరిగిన ప్రతిసారి గ్రామపెద్దలు వారికి సర్దిచెప్పి పంపేవారు. భార్య సునీత, అత్త చంద్రమ్మలు కలిసి గోపినాథ్ రెడ్డి తరపు కుటుంబ సభ్యులు, బంధువులను ఇంటికి రానిచ్చేది కాదు.

  దీనికితోడు తరచూ ఏదో ఒక కారణంతో గోపినాథ్ రెడ్డితో భార్య సునీత గొడవపడుతూనే ఉండేది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి గొడవ జరగ్గా, భార్య సునీత, అత్త చంద్రమ్మలు ఇద్దరూ కలిసి గోపినాథ్ రెడ్డిని క్రికెట్ బ్యాట్‌తో తలతో పాటు మర్మాంగంపై బలంగా కొట్టారు. దీంతో గోపినాథ్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయం స్థానికులు గమనించి పలమనేరు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Narsimha Badhini
  First published: