మామ పింఛన్ సొమ్ము కోసం.. కొడవలితో భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య..

భార్యభర్తలకు మద్యానికి బానిసలుగా మారారు. నిత్యం కూలీ పనులకు వెళితే వచ్చిన డబ్బుతో మద్యం తాగి ఘర్షణ పడేవారు. ఈ క్రమంలోనే శ్రీను తండ్రి పోచయ్యకు పింఛన్ సొమ్ము వచ్చింది.

news18-telugu
Updated: July 9, 2020, 6:57 AM IST
మామ పింఛన్ సొమ్ము కోసం.. కొడవలితో భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారిద్దరూ భార్యభర్తలు.. కలకాలం ఒకరికొకరు తోడునీడగా ఉంటూ బతకాల్సిన వారి మధ్య మద్యం మహమ్మారి చిచ్చు రేపింది. పింఛన్ సొమ్ము కోసం జరిగిన గొడవ కాస్త హత్యకు దారితీసింది. విచక్షణ కోల్పోయిన భార్య క్షణికావేశంలో నిద్రిస్తున్న భర్తపై కొడవలితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం రోళ్లపాడుకు చెందిన చింతకుంట్ల శ్రీను(30), అంజలి అలియాస్ స్వప్న దంపతులు. వీరికి ఏడు సంవత్సరాల కొడుకు తిరుపతి, ఐదు సంవత్సరాల కూతురు సువర్ణ. రోజూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే భార్యభర్తలకు మద్యానికి బానిసలుగా మారారు. నిత్యం కూలీ పనులకు వెళితే వచ్చిన డబ్బుతో మద్యం తాగి ఘర్షణ పడేవారు. ఈ క్రమంలోనే శ్రీను తండ్రి పోచయ్యకు పింఛన్ సొమ్ము వచ్చింది. అందులో తండ్రి పోచయ్య దగ్గరి నుంచి రూ.600 శ్రీను అడిగి తీసుకున్నాడు.

ఆ విషయం సాయంత్రానికి భార్యకు తెలిసి డబ్బు కోసం ఇద్దరు గొడవ పడ్డారు. ఆ డబ్బులు తన వద్ద లేవని ఖర్చు చేశానని చెప్పాడు. దీంతో ఆగ్రహంతో భార్య స్వప్న రగిలిపోయింది. అర్ధరాత్రి సమయంలో మంచంపై నిద్రిస్తున్న భర్తను స్వప్న కొడవలితో గొంతుకోసింది. దీంతో శ్రీను కేకలు వేయడంతో పక్క షెడ్డులో నిద్రిస్తున్న తండ్రి పోచయ్య ఇంటిలోకి వచ్చేసరికి స్వప్న పరారయ్యింది. శ్రీను మెడపై రెండు, ఎడమ చెంప, చెవి కింది భాగంలో, ఎడమ రొమ్ము పైభాగంలో తీవ్ర గాయాలపాలై చనిపోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు. తల్లిలో పరారీ ఉండడం.. తండ్రి విగతజీవిగా పడి ఉండడంతో పిల్లలిద్దరూ దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తండ్రి మృతదేహం వద్ద చిన్నారులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 6:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading