హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking Incident: పనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చిన ఇతనికి పాలు, బ్రెడ్ ఇచ్చిన భార్య.. ఆ తర్వాత ఊహించనిది జరిగింది..

Shocking Incident: పనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చిన ఇతనికి పాలు, బ్రెడ్ ఇచ్చిన భార్య.. ఆ తర్వాత ఊహించనిది జరిగింది..

బాధితుడు చరణ్

బాధితుడు చరణ్

అదనపు కట్నం కోసమో.. అడిగినవి ఇవ్వలేదన్న కోపంతోనో భార్యలను హింసించి.. చిత్రహింసలకు గురిచేసే కొందరు భర్తల గురించి విని ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర చూసి కూడా ఉంటారు. కానీ.. భర్త స్పృహ కోల్పోయేలా చేసి కరెంట్ షాక్ పెట్టి చంపాలని చూసిన భార్య గురించి విన్నారా.

ఇంకా చదవండి ...

  చురు: అదనపు కట్నం కోసమో.. అడిగినవి ఇవ్వలేదన్న కోపంతోనో భార్యలను హింసించి.. చిత్రహింసలకు గురిచేసే కొందరు భర్తల గురించి విని ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర చూసి కూడా ఉంటారు. కానీ.. భర్త స్పృహ కోల్పోయేలా చేసి కరెంట్ షాక్ పెట్టి చంపాలని చూసిన భార్య గురించి విన్నారా. రాజస్తాన్‌లో ఓ భర్తకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అతను ఎంతగానో ఇష్టంగా చూసుకుంటున్న భార్యే అతనిని చంపాలని చూసింది. కరెంట్ షాక్ పెట్టి వేధింపులకు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న సర్దార్‌షహర్ తాలూకాలోని అమ్రసర్ ప్రాంతానికి చెందిన మహేంద్రదన్ చరణ్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం ఓ యువతితో వివాహమైంది.

  పనికెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్యను ఉన్నంతలో బాగానే చూసుకుంటూ సంతోషంగా ఉండేవాడు. ఆగస్ట్ 12న రోజూలానే పనికెళ్లి సాయంత్రానికి ఇంటికొచ్చాడు. భర్త ఇంటికి రాగానే అతని భార్య తాగడానికి నీళ్లు ఇచ్చింది. కొంతసేపటికి.. పాలు, బ్రెడ్ తెచ్చి భర్తకు తినమని ఇచ్చింది. బ్రెడ్‌ను పాలల్లో ముంచుకుని తిన్న కొంతసేపటికే చరణ్‌కు మైకం కమ్మినట్టయింది. అలానే మంచం మీద పడిపోయాడు.

  ఇది కూడా చదవండి: Bengaluru: హాస్టల్‌లో ఉన్న కొడుకు అమ్మానాన్నకు కాల్ చేయగా ఇద్దరి ఫోన్లూ స్విచ్ ఆఫ్.. ఏమైందా అని ఇంటికొచ్చి చూస్తే..

  రాత్రి 8.15 సమయానికి అతనికి ఉన్నట్టుండి మెలకువ వచ్చి చూడగా.. అతని రెండు కాళ్లకు కరెంట్ వైర్లు కట్టి ఉన్నాయి. అతని భార్య చేతులకు ప్లాస్టిక్ కవర్లు ధరించి కరెంట్ షాక్ పెట్టి చంపేందుకు సిద్ధమయింది. అప్పటికీ కొన్ని సార్లు కరెంట్ షాక్ ఇచ్చింది. అతని టైం బాగుండి కుటుంబ సభ్యులు చూడటంతో గండం తప్పింది. అతనిని ఆసుపత్రికి తరలించారు. అతని భార్యపై ఫిర్యాదు చేశారు. తన భార్య తనను హత్య చేయాలని చూసిందని.. కరెంట్ షాక్ పెట్టి చంపాలని చూసిందని పోలీసులకు చరణ్ తెలిపాడు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Husband, Rajastan, Wife

  ఉత్తమ కథలు