WIFE LODGES COMPLAINT ON HUSBAND FOR LIVING TOGETHER WITH ANOTHER WOMAN MS
భర్త గురించి భార్యకు ఆ చేదు నిజం తెలిసి.. పెళ్లికి ముందే అతను..
ప్రేమ వివాహాలైతే పర్వాలేదు.. వాళ్లిద్దరూ అప్పటివరకూ సుపరిచితులే. వారి మధ్య అనుబంధం కొత్తగా ఏర్పడాల్సిన పన్లేదు.
పెళ్లికి ముందు కార్తీక్ మరో యువతితోనూ కొన్నాళ్లు సహజీవనం చేశాడు.ఒకరికి తెలియకుండా మరొకరితో సహజీవనం చేశాడు. ఇటీవల ఆమె కూడా పెళ్లి కోసం పట్టుబట్టడంతో.. కార్తీక్ తన భార్యకు దూరంగా ఉంటున్నాడు.
అతనో గ్రాఫిక్ డిజైనర్.. కొన్నాళ్ల క్రితం ఓ అమ్మాయితో పరిచయం ప్రేమలో పడేలా చేసింది. కొన్నేళ్ల సహజీనం తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్లుగా కార్తీక్ తనను దూరం పెడుతుండటంతో ఆమెలో అనుమానం మొదలైంది. ఆరా తీస్తే ఆ అమ్మాయికి ఓ చేదు నిజం తెలిసింది.పెళ్లికి ముందు మరో అమ్మాయితోనూ తన భర్త సహజీవనం చేశాడని తెలుసుకుంది. ఆమె ఒత్తిడి ఎక్కువ కావడంతో తనను దూరం పెడుతున్నాడని తెలుసుకుని.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన కార్తీక్(29) బెంగళూరులో గ్రాఫిక్ డిజైనర్. కెరీర్ ఆరంభంలో హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఉంటూ కొన్నాళ్లు నగరంలోనే పనిచేశాడు. ఆ సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అదికాస్త సహజీవనానికి దారితీసింది. కొన్నాళ్లకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు కార్తీక్ మరో యువతితోనూ కొన్నాళ్లు సహజీవనం చేశాడు.ఒకరికి తెలియకుండా మరొకరితో సహజీవనం చేశాడు. ఇటీవల ఆమె కూడా పెళ్లి కోసం పట్టుబట్టడంతో.. కార్తీక్ తన భార్యకు దూరంగా ఉంటున్నాడు.దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అసలు విషయం తెలిసిన భార్య కార్తీక్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.కార్తీక్‌ను బంజారాహిల్స్ పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో తనకు రెండు రోజుల సమయం కావాలని
కార్తీక్ పోలీసులను కోరాడు. అంతే.. ఆపై ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.