Home /News /crime /

WIFE LETTER TO HUSBAND TO GET AGAIN MARRIED MISSING CASE FILLED IN MALKAJGIRI VB

Telangana: మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు.. ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లిన భార్య.. అది చదివిన భర్త ఏం చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పిల్లలు పుట్టడం లేదంటూ ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త.

    అమ్మతనం అనేది ప్రతీ మహిళకు ఒక వరం. పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలగడం అనేది సాధారణం. అయితే కొంత మందిలో జన్యు లోపాల వల్ల కావచ్చు లేదా మరేదైనా కారణం వల్ల కావచ్చు సంతానం అనేది తొందరగా అందదు. అందుకోసం గైనకాలజిస్ట్ లను సంప్రదిస్తారు. ఇలా ఆమె 13 సంత్సరాల నుంచి ఆసుపత్రులకు తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో భర్తను వేరే పెళ్లి చేసుకొమ్మని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. ప్రేమ వివాహం చేసుకున్న ఆ దపంతులు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా సంతానం కలగలేదు. ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్నా కరుణించలేదు. విసుగుచెందిన ఆ ఇల్లాలు ఆసుపత్రికి రావడం తన వల్ల కాదంటూ భర్తకు లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. మరో పెళ్లి చేసుకొని సఖంగా ఉండండి అంటూ లేఖ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

    మల్కాజిగిరి పరిధి ఆర్​కే నగర్​లో నివసముండే జాడె రాకేశ్,​ కవిత (36)లు 13 ఏండ్ల కిందట ప్రేమ వివాహం ​చేసుకోగా వారికి పిల్లలు కలగట్లేదు. దీంతో కొన్నేండ్లుగా హాస్పటళ్లలో చూపించుకుంటున్నారు. అయితే ఇటీవల రాకేశ్ మెడికల్ షాపుకు వెళ్లి తిరిగి ఇంటికి రాగ తలుపుకు  తాళం వేసి ఉంది. భార్యకు ఎన్నిసార్లు ఫోన్​ చేసినా లిఫ్ట్ చేయలేదు. చుట్టుపక్కల వారిని అడగడంతో పాటు స్థానికంగా వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. కవిత ఫోన్​ అక్కడే ఉంది. ‘‘ఇక నేను హాస్పిటల్​కి రాను.. ఇంకో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు.. నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నా.. ఇది నా సొంత నిర్ణయం..” అంటూ భార్య ఉత్తరం రాసి టీవి పక్కన పెట్టింది.

    ఆ లెటర్ ను చదివిన రాకేశ్ షాక్ కు గురయయ్యాడు. నోటి నుంచి మాట రాలేదు. తన తల్లిదండ్రులకు, అత్తమామలకు ఫోన్ చేసి అక్కడకు వచ్చిందా అని అడిగాడు. రాలేదనడంతో కంగారు పడిన రాకేశ్ వెంటనే ​మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్​ కేసుగా నమోదు చేసినట్లు ఎస్​ఐ హరి ప్రసాద్​ తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Cirme, Malkajgiri police, Marriage, Missing case, Telangana, Women missing

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు