హోమ్ /వార్తలు /క్రైమ్ /

Married Woman: పెళ్లి జరిగిన 10 రోజులకు యువతికి ఊహించని షాక్.. అత్తకు ఆ విషయం చెబితే..

Married Woman: పెళ్లి జరిగిన 10 రోజులకు యువతికి ఊహించని షాక్.. అత్తకు ఆ విషయం చెబితే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ యువతికి ఘనంగా పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో భవిష్యత్తును ఊహించుకుంది. అత్తింట్లో ఆమెకు ఊహించని షాక్ తగిలింది.

ఆ యువతికి ఘనంగా పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో భవిష్యత్తును ఊహించుకుంది. అత్తింట్లో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. పెళ్లైనా 10 రోజులకు తన భర్త నపుంసకుడు అని తెలుసుకుని షాక్ తింది. ఈ విషయాన్ని అత్తమామలకు చెప్పింది. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లో(Gujarat) చోటుచేసుకుంది. వివరాలు.. అహ్మదాబాద్‌లోని షాహిబాగ్‌లో నివాసం ఉంటున్న మహిళకు కొద్ది రోజుల క్రితం పెళ్లి(Marriage) జరిగింది. పెళ్లి తర్వాత మహిళ.. తన భర్త, అత్తమామలతో కలిసి మహారాష్ట్రకు వెళ్లింది. అయితే పెళ్లి జరిగినప్పటికీ ఆమె భర్త దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. అయితే పది రోజులుగా భర్త తనతో శారీరక సంబంధం పెట్టుకోకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ.. అసలు విషయం ఏదో ఉందని అనుకుంది. ఈ క్రమంలోనే మహిళకు ఆమె భర్త నపుంసకుడు అని తెలిసింది.

ఈ విషయాన్ని ఆమె తన అత్తకు తెలిపింది. అయితే వారు ఆమెకు సరైన సమాధానం ఇవ్వలేదు. అంతేకాకుండా ఆమెపైనే వేధింపులకు పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. తన మామ మూడు నెలల తర్వాత తనకు విడాకులు ఇప్పిస్తామని చెప్పాడాని.. కానీ అలా జరగలేదని పేర్కొంది. తన భర్త అదనపు కట్నం కోసం వేధించేవాడని తెలిపింది. అంతేకాకుండా తనను అసభ్య పదజాలంతో దూషించేవాడని ఫిర్యాదులో తెలిపింది.

Shocking: అతనికి భార్య, ఇద్దరు కొడుకులు.. పక్క ఊరి మహిళతో ఎఫైర్.. ఆమె కోసం అన్ని చేస్తుంటే..


తన భర్త, అత్తమామలు.. వరకట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా హింసించారని మహిళ ఆరోపించింది. పుట్టింటి నుంచి బంగారం, నగలు, రాగి పాత్రలు తీసుకురావాలని డిమాండ్ చేసేవారని తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.

Extramarital Affair: ఊరిలో భార్య, పిల్లలు.. అద్దె ఇంట్లో ప్రేయసితో సహజీవనం.. భార్యకు అనుమానం.. చివరకు..


పసికందును అమ్మేసిన తల్లి..

తమిళనాడు‌లోని విరుద్‌నగర్‌ జిల్లాలో ఓ పసికందును ఆమె తల్లి అమ్మేసింది. 9 నెలల పసివాడని అంగట్లో వస్తువులా అమ్మేసింది. తమిళనాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. విరుద్‌నగర్ జిల్లాకు చెందిన మణికందన్ (38), జెబామలార్ (28) భార్యభర్తలు. 2019లో వీరికి వివాహం జరిగింది. మొన్నటి వరకు ఈ జంట అన్యోన్యంగా ఉన్నారు. గత ఏడాది పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. కానీ ఆ తర్వాత కొన్ని నెలల్లోనే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. కుటుంబ పెద్దలు ఎంత నచ్చజెప్పినా మారలేదు. చివరకు విడాకులు తీసుకున్నారు. భర్తతో విడాకుల తర్వాత జబామలార్ తన కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. దీంతో ఆమె రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఇప్పటికే పెళ్లి కావడం, ఓ కుమారుడు కూడా ఉండడంతో.. జెబామలార్‌ను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జెబామలార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కుమారుడి వల్లే తనకు పెళ్లి కావడం లేదని భావించి.. ఆ పసివాడిని అమ్మేయాలనుకుంది. అందుకు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారు. కానీ ఈ విషయాలేవీ బాలుడు తండ్రి మణికందన్‌కు తెలియవు.

First published:

Tags: Crime news, Gujarat

ఉత్తమ కథలు