అన్యోనంగా ఉండాల్సిన దంపతుల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. మద్యానికి బానిసగా మారిన వారు రోజూ గొడవ పడుతూ ఉన్నారు. కుటుంబ కలహాలతో ఓ రోజు వాగ్వాదానికి దిగిన భార్యాభర్తలు హత్యకు దారితీసింది. క్షణికావేశంలో భర్త తలపై రాయితో మోది చంపేసింది. ఈ ఘటన సిర్నాపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. సిర్నాపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్(32)కు నిజామాబాద్‌కు చెందిన సునితతో పదేళ్ల క్రితం వివాహం అయింది. మొదట్లో బాగానే ఉన్నా రానురాను ఇద్దరిమధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. రోజూ గొడవ పడుతూ ఉండేవారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. దీంతో వీరిద్దరు మద్యానికి బానిసగా మారారు. మద్యం మత్తులో గొడవకు దిగిన వీరు ఒకరినొకరు తిట్టుకున్నారు.
ఈ క్రమంలో సునిత తన భర్తను బండ రాయితో తలపై మోది హత్య చేసింది. సాయికుమార్ కు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న వారు వివరాలను సేకరించారు.
తానే తన భర్తను హత్య చేసినట్లు సునిత ఒప్పుకుంది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to murder, Brutally murder, Crime, Crime news, Nizamabad, Telangana, Wife kills husband