హైదరాబాద్‌లో దారుణం... భర్తను సజీవదహనం చేసిన భార్య...

బాధితుడి భార్యకు, మరో వ్యక్తితో లైంగిక సంబంధం ఉంది. అందుకు తన భర్త అడ్డువస్తున్నాడని గ్రహించింది. దీంతో అతడిని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది.

news18-telugu
Updated: December 5, 2019, 2:26 PM IST
హైదరాబాద్‌లో దారుణం... భర్తను సజీవదహనం చేసిన భార్య...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ వనస్థలిపురంలో గత నెల 26న జరిగిన దారుణ ఘటనకు సంబంధించి సంచలన విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎస్‌కేడీ నగర్‌లో గతనెల 26న అర్దరాత్రి గుడిసెలో ఉంటున్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. అయితే, అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగి గుడిసె తగలబడినట్టు పోలీసులు భావించారు. అయితే, ఈ కేసును విచారించిన పోలీసులు అసలు నిజాన్ని కనిపెట్టారు. ఆ రోజు అర్ధరాత్రి ఓ వ్యక్తి గుడిసెకు నిప్పు పెడుతున్న దృశ్యాలు దూరంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో ఈ కేసులో ఏదో ట్విస్ట్ ఉందని పోలీసులు గ్రహించారు. కేసును విచారించగా, సజీవదహనమైన వ్యక్తి భార్య మీద అనుమానం వచ్చింది. ఆమెను పూర్తిస్థాయిలో విచారించగా, అసలు విషయాన్ని బయటపెట్టింది.

బాధితుడి భార్యకు, మరో వ్యక్తితో లైంగిక సంబంధం ఉంది. అందుకు తన భర్త అడ్డువస్తున్నాడని గ్రహించింది. దీంతో అతడిని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. తన ప్రియుడితో కలసి ప్లాన్ అమలు చేసింది. గత నెల 26న రాత్రిపూట ప్లాన్ అమలు చేశారు. ఈ ఘటనలో నిందితురాలి భర్త సజీవదహనమయ్యాడు.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>