Home /News /crime /

WIFE KILLS HUSBAND WITH THE HELP OF BOYFRIEND NS

ప్రేమించి పెళ్లాడిన భర్తనే చంపిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అక్రమ సంబంధాలు అనేక కుటుంబాలను కూలుస్తున్నాయి. ఇతరులతో పడక సుఖం కోసం కట్టుకున్న భర్త భార్యను, భార్యను భర్త చంపిన ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

  అక్రమ సంబంధాలు అనేక కుటుంబాలను కూలుస్తున్నాయి. ఇతరులతో పడక సుఖం కోసం కట్టుకున్న భర్త భార్యను, భార్యను భర్త చంపిన ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి మరో ఘటన బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న వ్యక్తినే ఓ మహిళ కిరాతకంగా చంపేసింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో వారు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. ఎట్టకేలకు పాపం బయటపడడంతో నిందితురాలు, ఆమె ప్రియుడు, వారికి సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం..
  డెంకణికోటకు చెందిన ప్రేమ, మాదేశ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. మాదేశ్‌ టైలర్‌గా, ప్రేమ ఓ గార్మెంట్స్‌లో పనికి వెళ్లేది. ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో మరో వ్యక్తి ప్రవేశించాడు.

  కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రేమ ఇంటి వద్దే ఉండేది. ఈ సమయంలో ప్రేమకు శివమల్ల అనే వ్యక్తితో పరిచయమైంది. కొన్ని రోజులకు ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని పారిపోవాలనుకునే వరకు పరిస్థితి వెళ్లింది. అయితే ఇందుకు తన భర్త మాదేశ్ అడ్డుగా ఉన్నాడని ప్రేమా భావించింది. దీంతో అతడిని చంపేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఈ నెల 17 తేదీ రాత్రి అతడిని తీవ్రంగా కొట్టారు. చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ప్రేమ, శివమల్లు ఇద్దరిని నిందితులుగా గుర్తించారు. వారితో పాటు వారికి సహకరించిన మల్లేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో యువతి దారుణంగా మోసపోయింది. అతడి మాయమాటలకు వంచనకు గురై ఆ మైనర్‌ బాలిక గర్భం దాల్చింది. చివరకు ఆ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక తండాకు చెందిన సోనీ ( పేరు మర్చాం) అనే యువతి 10వ తరగతి పాస్ అయ్యింది. చదువుల్లో చురుగ్గా ఉండే ఆ యువతి కాలేజీలో చేరి తన కలలను నెరవేర్చుకోవాలనుకుంది. అప్పుడే ఆమె జీవితంలోకి సోమేష్ అనే యువకుడు ప్రవేశించాడు. సోమేష్ వృత్తిరీత్యా రాయచూరులో ఓ మెడికల్ షాపులో పనిచేసేవాడు. సోని ఉండే గ్రామంలో ఓ సారి పెళ్లికి అతిథిలా హాజరయ్యాడు. అక్కడే సోని అతడి దృష్టిలో పడింది. వెంటనే సోని స్నేహితుల ద్వారా ఆమె ఫోన్ నెంబర్ కనుక్కున్నాడు. తరచూ ఫోన్ చేసేవాడు. ప్రేమిస్తున్నానని, ప్రాణం ఇస్తాను అంటూ ఆమె వెంటపడ్డాడు.

  చివరకు సోని అతడి మయమాటలకు మోసపోయింది. అతడి ప్రేమకు అంగీకరించింది. రెండు నెలల పాటు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. సరిగ్గా మూడు నెలల క్రితం సోనీని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను తన లైంగిక వాంఛ తీర్చమని ఫోర్స్ చేశాడు. అందుకు ఆ బాలిక ససేమిరా అన్నది. పెళ్లి చేసుకున్న తర్వాతే అని తేల్చి చెప్పింది. అయినా సోమేష్ ఒప్పుకోలేదు. ఎలాగైనా తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. చివరకు సోనీ సరేఅని ఒప్పుకుంది. సోమేష్ పశువాంఛకు సోని బలిపశువు అయ్యింది. దీంతో బాలిక గర్భవతి అయ్యింది. అప్పటి నుంచి సోమేష్ అడ్రస్ లేకుండా పోయాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bangalore, Wife kill husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు