కట్టుకున్న భార్యే అతన్ని వంచించింది.. ప్రియుడితో కలిసి ఎంత దారుణం చేసిందంటే..

వివాహేతర సంబంధం గురించి తెలిసిన దివాకర్.. భార్య చైతన్యను వారించాడు. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించాడు.కానీ చైతన్య మాత్రం జంగయ్యతో కలిసి దివాకర్‌ను అంతమొందించాలనుకుంది.

news18-telugu
Updated: September 7, 2019, 12:10 PM IST
కట్టుకున్న భార్యే అతన్ని వంచించింది.. ప్రియుడితో కలిసి ఎంత దారుణం చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య.హంతకుడి సెల్‌ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు కేసును చేధించారు.

వివరాల్లోకి వెళ్తే.. పటాన్‌చెరులోని చైతన్యనగర్‌లో దివాకర్ అనే వ్యక్తి కుటంబంతో కలిసి నివసిస్తున్నాడు.ఇతనికి భార్య చైతన్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే దివాకర్‌కు కొన్నాళ్ల క్రితం జంగయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే జంగయ్య వద్ద దివాకర్ అప్పు తీసుకునేవాడు. అలా
అప్పుడప్పుడు జంగయ్య దివాకర్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో జంగయ్య-చైతన్యల మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది.

వివాహేతర సంబంధం గురించి తెలిసిన దివాకర్.. భార్య చైతన్యను వారించాడు. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించాడు.కానీ చైతన్య మాత్రం జంగయ్యతో కలిసి దివాకర్‌ను అంతమొందించాలనుకుంది. ఇద్దరు కలిసి అతని హత్యకు ప్లాన్ వేశారు.ప్లాన్ ప్రకారం.. జంగయ్య రూ.2లక్షల ఒప్పందం మేరకు దివాకర్‌ను హత్య చేయాలని ఇద్దరి వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. దాంతో అగస్టు 26వ తేదీ రాత్రి పెద్దకంజర్ల గ్రామ శివారులో దివాకర్‌ను పట్టుకుని.. తలపై బండరాయితో మోది హత్య చేశారు. కేసు దర్యాప్తు
ప్రారంభించిన పోలీసులు.. చైతన్య,జంగయ్యల సెల్‌ఫోన్ డేటాను పరిశీలించడంతో అసలు నిజం బయటపడింది. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు