ప్రియుడి కోసం ఏకంగా కట్టుకుని భర్తను చంపేందుకు సిద్ధమైంది ఓ భార్య. అతడితో కలిసి ప్లాన్ చేసి మరీ భర్తను చంపింది. అనంతరం ఆ మరణాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ఇద్దరు ప్రయత్నించారు. అయితే చివరకు పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా యాడికి మండలంలో భర్త శేఖర్‌తో కలిసి ఉంటున్న నాగమ్మ... వరసకు బావ అయిన బలరాముడుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నేళ్లుగా సాగిన వీరి వ్యవహరం శేఖర్‌కు తెలియడంతో... భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. బలరాముడితో సంబంధం మానుకోవాలని శేఖర్ పలుసార్లు నాగమ్మను కొట్టేవాడు.
దీంతో ఈ విషయాన్ని నాగమ్మ శేఖర్‌కు తెలిసింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న శేఖర్ని చంపాలని ప్లాన్ చేసిన నాగమ్మ, బలరాముడు... ఇందుకోసం పక్కా ప్లాన్ చేశారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని... ఓబులేసుకోన కొండకు వెళదామని నాగమ్మ శేఖర్‌ను నమ్మించింది. ఉదయం మూడు గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. మధ్యలో ఒక చోట బైక్ ఆపించింది. వెంటనే వారి వెనుక నుంచి వచ్చిన బలరాముడు క్రికెట్ బ్యాట్‌తో శేఖర్ తలపై బలంగా కొట్టాడు. దీంతో శేఖర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హత్య నాగమ్మ, బలరాముడు పరారయ్యారు. శేఖర్ యాక్సిడెంట్లో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.