ప్రియుడితో ఆ సంబంధం కోసం.. భర్తను హత్యచేసి ఆపై డ్రామా..

ముందస్తు ప్లాన్ ప్రకారం.. ఈ నెల 18న సతీష్ మద్యం తాగుతుండగా.. అందులో జ్యోతి నిద్రమాత్రలు కలిపింది. అతను మత్తులోకి జారుకున్న తర్వాత అర్ధరాత్రి ప్రియుడు భరత్,అతని స్నేహితుడు భాస్కర్‌లను పిలిపించింది.

news18-telugu
Updated: September 11, 2019, 8:39 AM IST
ప్రియుడితో ఆ సంబంధం కోసం.. భర్తను హత్యచేసి ఆపై డ్రామా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య.హత్యానంతరం ఆత్మహత్యగా చిత్రీకరించి అంతా నమ్మేశారని భావించింది. భర్త ఆర్మీలో పనిచేస్తుండటంతో ఆయనకు రావాల్సిన నగదును ఇప్పించాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేసింది. అయితే అధికారులకు ఎక్కడో చిన్న అనుమానం కలిగింది. దీంతో విచారణ జరిపించగా.. అసలు నిజాలు బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం మద్దిలపాలెంలో జ్యోతి(26) అత్త,భర్త,ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. భర్త సతీష్ (32) సైన్యంలో పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం జ్యోతికి భరత్ కుమార్(24) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి..వివాహేతర సంబంధానికి దారితీసింది. సెలవుపై ఇంటికొచ్చిన సతీష్‌కి భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి మందలించాడు.కానీ ఆమె ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. పైగా సతీష్ అడ్డు తొలగించుకోవాలని భావించింది.

ముందస్తు ప్లాన్ ప్రకారం.. ఈ నెల 18న సతీష్ మద్యం తాగుతుండగా.. అందులో జ్యోతి నిద్రమాత్రలు కలిపింది. అతను మత్తులోకి జారుకున్న తర్వాత అర్ధరాత్రి ప్రియుడు భరత్,అతని స్నేహితుడు భాస్కర్‌లను పిలిపించింది. వారిద్దరు చున్నీని సతీష్ మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి. జ్యోతి కూడా తన అత్తను,బంధువులను ఇలాగే నమ్మించింది. దీంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలోనే జ్యోతి సతీష్‌కు సైన్యం నుంచి రావాల్సిన డబ్బుల కోసం అధికారులకు వినతిపత్రం ఇచ్చింది. అయితే అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా డొంకంతా బయటపడింది. దాంతో జ్యోతి,భరత్,భాస్కర్‌లను అరెస్ట్ చేసిన

పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>