పెళ్లయిన 20 రోజులుకే దారుణానికి ఒడిగట్టిన భార్య..

భర్త వేధింపులు భరించలేక ఓ కొత్త పెళ్లి కూతురు అతన్ని కడతేర్చింది. పెళ్లైన 20 రోజులకే ఆమె ఈ దారుణానికి పాల్పడింది.

news18-telugu
Updated: September 12, 2020, 8:25 AM IST
పెళ్లయిన 20 రోజులుకే దారుణానికి ఒడిగట్టిన భార్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భర్త వేధింపులు భరించలేక ఓ కొత్త పెళ్లి కూతురు అతన్ని కడతేర్చింది. పెళ్లైన 20 రోజులకే ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఫర్నీచర్ దుకాణంలో పనిచేసే మహ్మద్ అస్లాంకు, జిర్రా మహబూబ్ కాలనీకి చెందిన సమ్రిన్‌తో గత నెల 19న పెళ్లి జరిగింది. అయితే పెళ్లైనా మరసటి రోజు నుంచే అస్లాం ఇంటికి తాగి వచ్చి భార్యను వేధించేవాడు. ఇలా వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా అస్లాం, సమ్రిన్ మధ్య ఘర్షణ చోటు చేసకుంది.

ఆ ఘర్షణలో సమ్రిన్ రోకలిబండతో అస్లాంపై దాడి చేసింది. రోకలిబండతో బలంగా బాదడంతో అస్లాం తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అస్లాం మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమ్రిన్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Published by: Sumanth Kanukuka
First published: September 12, 2020, 7:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading