Wife Kills Husband : రాజస్తాన్(Rajastan) రాష్ట్రంలోని బార్మర్ లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్త(Husband)ను దారుణంగా హత్య చేసింది. తక్కువ జీతం సంపాదిస్తున్నాడని భర్తను బెల్టుతో గొంతుబిగించి హత్య చేసింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. . ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మంజూ-అనిల్‌కుమార్ భార్యాభర్తలు. అనిల్ కుమార్ చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భర్తకు జీతం(Salary) తక్కువ అని,తన కోరికలు తీర్చేందుకు తగినంత డబ్బు
సంపాదించడంలేదని భార్య(Wife) మంజూ భావిస్తుండేది. ఇదే కారణంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం దంపతులు మద్యం సేవించారు. ఈ సమయంలోనే డబ్బుల విషయంలో మంగళవారం అర్థరాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన భార్య భర్తను హత్య చేసింది. భర్త బెల్టుతోనే అతడి గొంతుబిగించి హత్య చేసింది భార్య. దంపతుల అరుపులు విన్న కుటుంబీకులు వెంటనే కుమారుడి గదికి చేరుకున్నారు. అతని గదికి చేరుకునే సరికి కొడుకు నేలపై పడి ఉన్నాడని, అతని మృతదేహం దగ్గర కోడలు నిలబడి ఉందని అనిల్ కుటుంబసభ్యులు తెలిపారు.
Shocking : ప్రియురాలి గోంతుకోసి..చెట్టుకు ఉరేసుకున్న యువకుడు!
ఈ హత్యకు సంబంధించి నగరంలోని కుంతి పోలీస్ స్టేషన్‌లో బాధితుడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఉగ్మరాజ్ సోనీ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు మంజును పోలీసులు విచారించారు. విచారణలో మంజు హత్య చేసినట్లు ఒప్పుకుంది. నేరం ఒప్పుకోవడంతో నిందితురాలు భార్య మంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు మొత్తం హత్యాకాండపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.