భర్తను గొంతుకోసి చంపిన భార్య.. వనపర్తిలో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

కొంతకాలంగా బాల్య నాయక్ తన భార్య మణెమ్మపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. మంగళవారం రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త వేధింపులను భరించలేకపోయిన ఆమె.. అదే రాత్రి భర్తను చంపేసింది.

  • Share this:
    అనుమానపు భర్తను దారుణగా చంపేసిందో భార్య. కట్టుకున్న భర్తను కత్తితో గొంతు కోసి కిరాతకంగా హత్యచేసింది. వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం స్కూల్ తండా గ్రామంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్యా తండాకు చెందిన బాల్య నాయక్, మణెమ్మ భార్య భర్తలు. బాల్య నాయక్ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఐతే కరోనా లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేక.. భార్యభర్తలు సొంతూరికి వచ్చారు. కొంతకాలంగా బాల్య నాయక్ తన భార్య మణెమ్మపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. మంగళవారం రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త వేధింపులను భరించలేకపోయిన ఆమె.. అదే రాత్రి భర్తను చంపేసింది. కూతురు శారద సాయంతో భర్త గొంతు కోసి హత్య చేసింది. స్థానికులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెద్దమందడి ఎస్‌ఐ రాము తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: