భర్త ఇంట్లో లేని సమయంలో భార్య తన బాయ్‌ఫ్రెండ్ కలిసి...ఆ పని చేస్తుంటే...?

తన వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రేణు, ఎలాగైనా అతడిని అడ్డుతొలగించుకోవాలని చూసింది. వినీత్, రేణు బంధం గురించి వాస్తవాలు తెలుసుకున్న రూప్ చంద్... రెడ్ హ్యాండెడ్‌గా కూడా ఇద్దరినీ పట్టుకొన్నాడు.

news18-telugu
Updated: June 17, 2019, 5:22 PM IST
భర్త ఇంట్లో లేని సమయంలో భార్య తన బాయ్‌ఫ్రెండ్ కలిసి...ఆ పని చేస్తుంటే...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 17, 2019, 5:22 PM IST
తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తెలిసి కట్టుకున్న భర్తను బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మహిళ హత్య చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...డెహ్రాడూన్ లో నివాసముంటున్న మృతుడు రూప్ చంద్ ఆత్మహత్య, చివరికి హత్యగా తేలింది. డోయివాలా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు రూప్‌చంద్ స్థానికంగా ఉన్న పాఠశాలలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతని భార్యతో కలిసి కోట్వాలీ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అయితే మృతుడి భార్య రేణుకు అదే ప్రాంతంలో ఉన్న వినీత్ తో కలిసి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తన వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రేణు, ఎలాగైనా అతడిని అడ్డుతొలగించుకోవాలని చూసింది. వినీత్, రేణు బంధం గురించి వాస్తవాలు తెలుసుకున్న రూప్ చంద్... రెడ్ హ్యాండెడ్‌గా కూడా ఇద్దరినీ పట్టుకొన్నాడు. అంతేకాదు రూప్‌చంద్ తన భార్యను మందలించాడు. దీంతో నిందితురాలు రేణు తన భర్తపై మరింత పగ పెంచుకుంది.

ప్రియుడు వినీత్‌తో రేణు కలిసి రూప్ చంద్‌ను హత్య చేయాలని ప్రయత్నం చేసింది. ముందుగా రేణు జూన్ 9న మోతాదుకు మించిన నిద్రమాత్రలను భోజనంలో కలిపి రూప్ చంద్ కు తినిపించింది. దీంతో రూప్ చంద్ గాఢనిద్రలో జారుకున్నాడు. అనంతరం రూప్‌చంద్ ను తన ప్రియుడు వినీత్ తో కలిసి ఉరి వేసింది. అలాగే తన భర్త ఉరి వేసుకున్నాడని స్థానికులను పిలిచి నిందితురాలు రేణు గగ్గోలు చేసింది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని రూప్ చంద్ పోస్టుమార్టం చేయగా ఆత్మ హత్య కాదని హత్య అని తేలింది. దీంతో రేణు ఆమె బాయ్ ఫ్రెండ్ వినీత్ మధ్య కాల్ లిస్టును చూడగా, అసలు విషయం బయట పడింది. ఇద్దరినీ పోలీసులు విచారించగా నేరం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో వీరిని అరెస్టు చేశారు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...