ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. డీసీఎంతో ఢీకొట్టి హత్య

ప్రతీకాత్మక చిత్రం

సురేష్ కుటుంబ సభ్యులు ఊహించినట్లుగానే అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్య..! అతడి భార్యే ప్రియుడితో కలిసి డీసీఎంతో ఢీకొట్టించింది.

  • Share this:
    కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసిందో భార్య. ప్రియుడిలతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. డీసీఎం వాహనంతో ఢీకొట్టి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. మేడ్చల్‌లో గత నెలలో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 25న మేడ్చల్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సురేష్ అనే వ్యక్తి మరణించాడు. మొదట అందరూ రోడ్డు ప్రమాదమనే అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులకు భార్యను అనుమానించారు. ఆమెలో ఎలాంటి బాధ కనిపించకపోవడంతో.. రోడ్డు ప్రమాదం వెనక ఈమె కుట్ర ఉండవచ్చని భావించారు. ఈ క్రమంలో సురేష్ భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    సురేష్ కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేశారు. భార్యను పలుమార్లు ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సురేష్ కుటుంబ సభ్యులు ఊహించినట్లుగానే అది రోడ్డు ప్రమాదం కాదు.. హత్య..! అతడి భార్యే ప్రియుడితో కలిసి డీసీఎంతో ఢీకొట్టించింది. ప్రియుడిలతో కలిసి డీసీఎంను సురేష్‌పైకి ఎక్కించి చంపేసింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయినట్లు నమ్మించింది. కానీ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత.. ఆమె అసలు బాగోతం బట్టబయలయింది. కట్టుకున్న భర్తను తానే చంపేసినట్లు రుజువయింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.
    First published: