నల్లగొండలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..

నిద్రలో ఉన్న రమేష్ కాళ్లను స్వప్న పట్టుకోగా.. నాగరాజు ఓ వైరుతో మెడకు బిగించి చంపేశాడు. మద్యం మత్తులో అతడు చనిపోయాడని గ్రామస్తులను నమ్మించిన స్వప్న అంత్యక్రియలు జరిపించింది.

news18-telugu
Updated: November 8, 2019, 9:56 PM IST
నల్లగొండలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసింది భార్య.  ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతచెట్టు తండాలో ఈ ఘటన జరిగింది. అక్టోబరు 29న జరిగిన ఈ హత్య వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. చింతచెట్టు తండాకు చెందిన నేనావత్ రమేశ్(25), స్వప్న దంపతులు హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మునగాలకు చెందిన నాగరాజుతో కలిసి రమేష్ ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఐతే నాగరాజుతో రమేష్ భార్య స్వప్నకు పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం రమేష్‌కు తెలిసి పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది. భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి.

ఈ నేపథ్యంలో భర్త అడ్డును తొలగించుకోవాలని నిర్ణయించుకున్న స్వప్న ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను చంపేసింది. దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చిన రమేష్‌కు పెరుగులో మత్తు మాత్రలను కలిపింది. అతడు నిద్రలోకి జారుకోగానే ప్రియుడు నాగరాజుకు ఫోన్ చేసిన తమ తండాకు రప్పించుకుంది. నిద్రలో ఉన్న రమేష్ కాళ్లను స్వప్న పట్టుకోగా.. నాగరాజు ఓ వైరుతో మెడకు బిగించి చంపేశాడు. మద్యం మత్తులో అతడు చనిపోయాడని గ్రామస్తులను నమ్మించిన స్వప్న అంత్యక్రియలు జరిపించింది. ఐతే రమేష్ గొంతుపై గాట్లను గుర్తించిన ఓ వ్యక్తి అనుమానమొచ్చి డెడ్‌బాడీ ఫొటోలు తీశాడు. మృతుడి సోదరుడికి స్పప్న ప్రవర్తనపై అనుమానం రావడంతో నవంబరు 5న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు