Home /News /crime /

WIFE KILLS HER HUSBAND WITH FIRE AK

భర్తపై కిరోసిన్ పోసి చంపిన భార్య..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెరుగైన చికిత్స కోసం బాధితుడిని ఢిల్లీలోని సఫ్ధార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.

    ఆ భార్యభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు భర్త హత్యకు దారి తీసింది. భర్తపై కొంతకాలంగా కోపంతో ఉన్న అతడి భార్య.. అతడితో గొడవ పెట్టుకుంది. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో భర్తపై కిరోసిన్ పోసిన భార్య.. అతడికి నిప్పంటించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మురద్‌నగర్ పట్టణంలోని మూల్‌చంద్ త్యాగి అతడి భార్య గీతతో కొంతకాలం నుంచి గొడవ పడుతున్నారు. గీత త్యాగికి రెండో భార్య. అయితే గత గురువారం వీరిద్దరి మధ్య గొడవ పెద్దదైంది. ఈ క్రమంలోనే భర్త త్యాగిపై కిరోసిన పోసిన భార్య గీత.. అతడికి నిప్పంటించింది.

    దీంతో త్యాగి తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం అతడిని ఢిల్లీలోని సఫ్ధార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాలు తీవ్ర కావడంతో రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన త్యాగి.. ఆదివారం రాత్రి చనిపోయాడు. త్యాగి మొదటి భార్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మృతుడి భార్య గీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కోపంలో భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిందా లేక ముందుగానే భర్తను హతమార్చేందుకు కుట్ర పన్నిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు