చెల్లిని రేప్ చేశాడని.. భర్తను చంపి పెరట్లో పాతిపెట్టిన భార్య

కళ్ల ముందే ఇంత దారుణం జరగుతుండడంతో బాలిక అక్క సహించలేకపోయింది. ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని భర్తపై దాడి చేసింది. తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

news18-telugu
Updated: June 4, 2020, 3:36 PM IST
చెల్లిని రేప్ చేశాడని.. భర్తను చంపి పెరట్లో పాతిపెట్టిన భార్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కట్టుభర్తను కసిదీరా నరికి చంపిందో భార్య. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆ మహిళ.. భర్తను హత్య చేసి ఇంటి పెరటిలోనే పూడ్చిపెట్టింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. రాజస్థాన్‌లో సికార్ జిల్లాలో జూన్ 2న ఈ దారుణం చోటుచేసుకుంది. ఐతే ఈ హత్యకు బలైన కారణమే ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధోండ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 8 నెలల గర్భిణి. ఇప్పటికే ఆమెకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో ఇంటి పనులు చేసుకోవడం కష్టంగా మారింది. తనకు సాయంగా ఉంటుందని 8వ తరగతి చదువుతన్న తన చెల్లిని ఇంటికి తెచ్చుకుంది. పిల్లలను చూసుకుంటూ అక్కడకు చేదోడు వాదోడుగా ఉండేది ఆ బాలిక.

ఐతే తన మరదలిపై బావ కన్నేశాడు. ఆమెను ఎలాగైన లోబరచుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత.. మరదలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చెల్లి అరుపులు విన్న ఆ మహిళ ఉలిక్కిపడి లేచింది. తన చెల్లిని వదలిపెట్టాలని భర్త కాళ్లావేళ్లా పడింది. ఐనా ఆ కామాంధుడు వదలిపెట్టలేదు. భార్యను పక్కకు తోసేసి మరదలిపై పశువాంఛను తీర్చుకున్నాడు. కళ్ల ముందే ఇంత దారుణం జరగుతుండడంతో బాలిక అక్క సహించలేకపోయింది. ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని భర్తపై దాడి చేసింది. తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి.. ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టింది. ఎప్పటికైనా విషయం బయటకు తెలుస్తుందని.. కేసు తప్పదని భావించి.. తానే అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. తన భర్తను చంపేశానంటూ.. కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. హత్యకు దారితీసిన కారణాలను వివరించడంతో వారు షాక్ తిన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్టుమార్టం కోసం తలరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చెల్లిని కూడా విచారించి.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలన రేపింది.
Published by: Shiva Kumar Addula
First published: June 4, 2020, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading