Home /News /crime /

WIFE KILLED HUSBAND WITH THE HELP OF LOVER IN NELLORE DISTRICT OF ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

Andhra Pradesh: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దారుణ హత్య... పోలీసుల విచారణలో సంచలన నిజాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Extramarital Affair: వారి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అంతా బాగుందనుకున్న తరుణంలో భార్య దారితప్పింది.

    వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అంతా బాగుందనుకున్న తరుణంలో భార్య దారితప్పింది. వేరొకరి మోజులో పడి కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పువీధికి చెందిన రాజేశ్వరమ్మ కుమారుడు రూపేష్.. అదే ప్రాంతానికి చెందిన మానసను ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం రూపేష్.. భార్య మానసతో కలిసి నరసయ్యగుంటలో నివాసముంటున్నాడు. ప్రస్తుతం ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రశాంతంగా సాగుతున్న వీరి లైఫ్ లో అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి.

    రూపేష్ భార్య మానసకు గూడురు మండలం కొండాగుంటకు చెందిన రవివర్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. మానస.. రవివర్మతో సన్నిహితంగా ఉండటం గమనించిన రూపేష్.. పలుసార్లు భార్యను మందలించారు. పద్ధతి మార్చుకోవాల్సిందిగా హెచ్చరించారు. ఐతే రవివర్మ మోజులో పడిపోయిన మానస.. ఎలాగైనా భర్తను హతమార్చాలని ప్లాన్ వేసింది. తన ప్లాన్ ను ప్రియుడు రవివర్మతో చెప్పింది.

    ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈనెల 11న అర్ధరాత్రి నిద్రపోతుండగా రూపేష్ పై రవివర్మ, మానస కలిసి ఇనుపరాడ్డుతో దాడి చేశారు. దీంతో రూపేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. రూపేష్ తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మానస కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపి రవివర్మను అదుపులోకి తీసుకున్నారు. తొలుత బుకాయించిన నిందితులు.. తర్వాత అసలు నిజం చెప్పారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Crime, Crime news, Extramarital affairs, Murder, Telugu news, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు