Home /News /crime /

WIFE KILLED HUSBAND WITH THE HELP OF LOVER FOR EXTRAMARITAL AFFAIR IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH PRN

Andhra Pradesh: పెళ్లైన 32 ఏళ్లకు భర్తను చంపిన భార్య.., అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Extramarital Affair: మాలకొండయ్య-లక్ష్మి దంపతులిద్దరూ అల్లుడికి సంబంధించిన కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గొట్లగట్టు గ్రామానికి చెందిన శరవణ్ కుమార్ అనే యువకుడితో లక్ష్మీదేవికి పరిచయం ఏర్పడింది.

    పెళ్లై 32 ఏళ్లైంది. అన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హతమార్చింది ఓ భార్య. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా బెస్తవారపేట మండలం మోక్షగుండంలో జనవరి 29న గోనెసంచిలో మూటగట్టిన మృతదేహాన్ని పాడుబడ్డ బావిలో పోలీసులు గుర్తించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అసలు మిస్టరీని తేల్చేశారు. కొమరోలు మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఉరియ మాలకొండయ్య, లక్ష్మీదేవి దంపతులకు 32 ఏళ్ల క్రితం పెళ్లైంది వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమర్తెకు ఇప్పటికే వివాహమైంది. మాలకొండయ్య-లక్ష్మి దంపతులిద్దరూ అల్లుడికి సంబంధించిన కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గొట్లగట్టు గ్రామానికి చెందిన శరవణ్ కుమార్ అనే యువకుడితో లక్ష్మీదేవికి పరిచయం ఏర్పడింది.

    అది వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం భర్తకు తెలియడంతో వారిని మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా ఈనెల 17న భర్తను నమ్మించి తీసుకెళ్లిన మహాలక్ష్మి అతడికి మద్యం తాగించి పొల్లాల్లో ఉరివేసి చంపారు. అనంతరం ఆ మృతదేహాన్ని గోనెసంచిలో మూటగట్టి పాడుబడిన బావిలో పడేశారు. జనవరి 29న స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కీలక ఆధారాలు సేకరించారు. ఈలోగా ఆందోళన చెందిన నిందితులు వీఆర్వో ఎదుట లొంగిపోయారు.

    ప్రేమ విఫలమై యువకుడి బలన్మరణం
    ప్రేమలో విఫలమయ్యానన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన చంద్రగిరి వెంకట సతీష్‌రెడ్డి(25) ఓ యువతిని ప్రేమించాడు. ఏమైందో ఏమో తెలియదుగానీ శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ స్థానికంగా ఓ యువతిని ప్రేమించాడని.. ఆమె అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు చేతికి అందివచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడటంతో తండ్రి ఏడుకొండలు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Crime, Crime news, Extramarital affairs, Illegal affairs, Illegal relationship, Murder, Prakasham dist, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు