భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రాక వల్ల అనేక ఘోరాలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలహాలు మొదలయి కుటుంబాల్లో కల్లోలం జరుగుతోంది. భర్తను భార్యో, భార్యను భర్తో హతమారుస్తున్నారు. ఫలితంగా అభంశుభం ఎరుగని పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ భార్య తన భర్తను హతమార్చింది. ఆ తర్వాత అదే ప్రియడి సాయంతో మృతదేహాన్ని మాయం చేసింది. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుచేసిన వాళ్లు ఎప్పటికైనా దొరక్కమానరన్న నానుడిని నిజం చేస్తూ 54 రోజుల తర్వాత పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. పోలీసుల విచారణలో ఆమె చేసిన ఒకే ఒక్క తప్పువల్ల చేసిన ఘోరం బయటపడింది. ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వీవర్స్ కాలనీలో నాగభూషణం అలియాస్ చిట్టి అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. అతడికి నల్లమాడ మండలం మీసాలవాండపల్లికి చెందిన ఈశ్వరమ్మతో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగభూషణానికి ఈశ్వరమ్మ స్వయానా సోదరి కుమార్తె. మేనమామ వరుస అవుతాడు. ఇద్దరు పిల్లలు, భర్తతో హ్యాపీగా కుటంబాన్ని గడపాల్సిన ఈశ్వరమ్మకు ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం పచ్చని సంసారాన్ని నాశనం చేసింది. అతడితో ఏర్పడిన వివాహేతర సంబంధం కోసం భర్తనే హతమార్చాలనుకుంది.
ఇది కూడా చదవండి: నిర్మానుష్యంగా ఉన్న అతిథిగృహం.. యువకుడితో వెళ్లిన ఓ యువతి.. గెస్ట్ హౌస్ యజమాని కుమారుడు చూసి..
జనవరి ఒకటో తారీఖున పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోనే భర్తను చంపేసింది. జనవరి రెండో తారీఖున తన ప్రియుడు, మరో ముగ్గురు వ్యక్తుల సహాయంతో భర్త మృతదేహాన్ని పిల్లవంక కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత పథకం ప్రకారం తన భర్త ఎక్కడికో వెళ్లాడని, బంధువుల ఇళ్లకు కూడా వెళ్లలేదని చుట్టుపక్కల వారితో చెప్పి వాపోయింది. ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. రెండు రోజుల క్రితం ముదిగుబ్బలో గుర్తు తెలియని శవం ఒకటి బయటపడింది. అప్పటికే ఈశ్వరమ్మ మిస్సింగ్ కేసు నమోదుచేయడంతో శవాన్ని గుర్తించడానికి పోలీసులు పిలిచారు. ’ఆ మృతదేహం మీ భర్తదేనా? కాదో చూడండి‘ అని పోలీసులు అనడంతో ఆమె ఆ మృతదేహం వద్దకు వెళ్లింది. అక్కడ ఆ మృతదేహం తన భర్తది కాదని చెబుతూనే అనుమానాస్పదంగా ప్రవర్తించింది. ఆమె భయపడుతూ, కంగారుపడుతూ ఉండటాన్ని పోలీసులు గమనించారు.
ఇది కూడా చదవండి: కోడి కాలికి కత్తిని కట్టాడు.. రెండో కాలికి కూడా కడుతుండగా పరార్.. మర్మాంగాలకు తగిలిన కోడి కత్తి.. చివరకు..
దీంతో భర్త మిస్సింగ్ కేసులో ఆమెపైనే పోలీసులు అనుమాన పడ్డారు. చివరకు స్థానికంగా ఇతరులను ఆరా తీశారు. అదే సమయంలో ఆమె ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. భర్త మిస్సింగ్ కు ఆమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు, ఆ తర్వాత ఆమెను విచారించారు. తమదైన స్టైల్లో ప్రశ్నించారు. ఎట్టకేలకు ఈశ్వరమ్మ నిజం ఒప్పుకుంది. భర్తను తానే చంపానని పోలీసులకు చెప్పింది. ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి భర్త మృతదేహాన్ని పిల్లవంక కాలనీ సమీపంలో పూడ్చిపెట్టానని చెప్పింది. దీంతో మంగళవారం ఆమెను తీసుకెళ్లి, భర్త శవాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి భర్తను చంపిన 54 రోజుల తర్వాత భార్య బండారం బయటపడినట్టయింది. ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.