పెళ్లికి వెళ్లిన భర్త మిస్సింగ్.. కేసు పెట్టిన కొద్ది రోజుల్లోనే భార్య కూడా అదృశ్యం.. ఆ ఇంటి పెరట్లో బయటపడిన బండారం..!

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. తన కంటే వయసులో చిన్న వాడే అయినా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తప్పని చెప్పిన భర్తను తెలివిగా అడ్డు తప్పించారు.

 • Share this:
  వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. ఎంతో మందిని అనాథలుగా మారుస్తోంది. ప్రియుడి మోజులో పడిపోయిన భార్యను భర్తే చంపడమో, ప్రేయసితో తిరుగుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్న భర్తను భార్యే హతమార్చుతున్న సంఘటనలు రోజూ ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. నేరం చేస్తున్నప్పుడు తాము దొరకమనే నమ్మకంతోనే దారుణాలకు పాల్పడుతున్నా, వారు చేసే చిన్న చిన్న తప్పులే వారిని పట్టిస్తున్నాయి. తాజాగా ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. తన కంటే వయసులో చిన్న వాడే అయినా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తప్పని చెప్పిన భర్తను తెలివిగా అడ్డు తప్పించారు. ఏకంగా ఇంటి పెరట్లోనే పూడ్చిపెట్టారు. అయినప్పటికీ వారిని పోలీసులు పట్టేశారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తమిళనాడులోని విల్లుపురం జిల్లా పూనరసం కుప్పంలో విక్రవాండి సమీపంలోని పనయకపురానికి చెందిన సహాయం అనే వ్యక్తికి 31 ఏళ్ల లియోబాల్ అనే కుమారుడు ఉన్నాడు. అతడికి 2013వ సంవత్సరంలోనే సుజితా మేరి అనే 25 ఏళ్ల యువతితో వివాహం అయింది. లియోబాల్, సుజితామేరి దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హ్యాపీగా సాగుతున్న వీరి కాపురంలోకి మరో యువకుడి రాక వల్ల కుటుంబం చిన్నాభిన్నమయింది. అదే ఊళ్లో ఉండే రాధాకృష్ణన్ అనే 22 ఏళ్ల యువకుడు లియోబాల్ కు పరిచయం అయ్యాడు.
  ఇది కూడా చదవండి: ఒక్క ఘటనతో వరుడికి డబుల్ షాక్స్.. తెల్లవారుజామున వధువును తీసుకెళ్లిన తాత.. చివరకు సీన్ రివర్స్

  రాధాకృష్ణన్ కూడా లియోబాల్ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే లియోబాల్ భార్య సుజితామేరితో రాధాకృష్ణన్ కు పరిచయం అయింది. అది కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఫిబ్రవరి 4వ తారీఖున బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్తున్నానని చెప్పిన లియోబాల్ తిరిగి ఇంటికి రాలేదు. భర్త ఇంటికి రాలేదంటూ తన మామయ్య, లియోబాల్ తండ్రితో సుజితా మేరి చెప్పింది. అన్ని చోట్లా విచారణ చేసిన తర్వాత లియోబాల్ తండ్రి సహాయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 21వ తారీఖున సుజితామేరి, రాధాకృష్ణన్ కనిపించకుండా పోయారు. దీంతో లియోబాల్ తండ్రి సహాయంకు అనుమానం వచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
  ఇది కూడా చదవండి: రోజుల గ్యాప్ లోనే వరుస ఘటనలు.. ప్రపంచం అంతానికి ఇవే చివరి సూచనలు.. 2021లో ఏం జరగబోతోందో ముందే చెప్పిన నోస్ట్రడామస్..!

  భర్త కనిపించకుండా పోవడం, ఆ తర్వాత భార్య కూడా మిస్సవడంతో విచారణ చేపట్టిన పోలీసులకు రాధాకృష్ణన్ విషయం కూడా తెలిసింది. రాధాకృష్ణన్ కు, సుజితామేరికి వివాహేతర సంబంధం ఉందన్న నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇంట్లో పూర్తిగా వెతికారు. ఆ ఇంట్లోనే పెరట్లో ఇటీవలే తవ్వినట్టుగా కనిపించిన ఓ చోట మళ్లీ తవ్వారు. అక్కడ లియోబాల్ మృతదేహం బయటపడింది. వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పడంతో భర్తను చంపి, ఇంటి పెరట్లో పూడ్చిపెట్టారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పరారీలో ఉన్న సుజితామేరీ, రాధాకృష్ణన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
  ఇది కూడా చదవండి: సెలూన్‌లో పనిచేసే 23 ఏళ్ల కుర్రాడు.. హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్‌ యువతి.. కులం, మతం వేరైనా ఆమె పెళ్లికి సిద్ధపడినా..
  Published by:Hasaan Kandula
  First published: