భర్తను చంపిన భార్య... ఆ విషయంలో తేడా వచ్చి...

Andhra Pradesh : హత్య అనేది ఎప్పటికీ సమస్యే. చంపేయడం ద్వారా పగ తీరినట్లు ఫీలవుతారేమోగానీ... ఆ తప్పు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. జైల్లో ప్రతి రోజూ ఆవేదనే మిగులుతుంది.

news18-telugu
Updated: December 16, 2019, 7:46 AM IST
భర్తను చంపిన భార్య... ఆ విషయంలో తేడా వచ్చి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Andhra Pradesh : భార్య భర్త ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా ఇద్దరికీ సమస్యే. కలిసిమెలిసి జీవిస్తేనే ఆ కాపురం హాయిగా ఉంటుంది. కానీ... చాలా కుటుంబాల్లో అలా జరగట్లేదు. భర్తో, భార్యో ఎవరో ఒకరు చేసే తప్పులకు... మొత్తం కుటుంబ వ్యవస్థే పతనమవుతోంది. గుంటూరు జిల్లా... దుర్గిలో జరిగిందో దారుణం. అర్థరాత్రి భారీ శబ్దం వచ్చింది. చుట్టుపక్కల వాళ్లకు మెలకువ వచ్చినా... మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారే కలకలం. పక్కింట్లో ఏడుపులు వినిపిస్తున్నాయి. ఏంటా వెళ్లి చూస్తే... దారుణ దృశ్యం. విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే వచ్చి... నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఇంతకీ ఈ హత్య ఎందుకు జరిగిందంటే... రోజూ ఇంటికి తాగి వచ్చేవాడు. భార్యను రకరకాలుగా వేధించేవాడు. ఆ కుటుంబం కోసం ఇద్దరు కొడుకులు... నెల నెలా డబ్బు పంపిస్తున్నారు. గత రాత్రి ఆ డబ్బు తనకు ఇవ్వాలని నానా రభస చేశాడు. ఆ తర్వాత మద్యం మత్తులో నిద్రపోయాడు. రోజూ ఏంటీ గోల అనుకుంది. ఎన్నేళ్లీ నరకం అని విసిగిపోయింది. చిరాకొచ్చేసింది. అతనితో బతకలేననుకుంది. చంపేస్తే పీడ విరగడైపోతుందని భావించిన ఆమె... భర్త నిద్రపోతున్న టైంలో బండరాయితో తలపై ఒక్కట్టిచ్చింది. అంతే... తల బద్ధలైపోయింది. క్షణాల్లో అతడు చనిపోయాడు. భర్తతో పోరు పడలేకపోతే... విడాకులు తీసుకోవచ్చు. లేదా ఇద్దరు కొడుకుల్లో ఎవరిదగ్గరకైనా వెళ్లి బతకొచ్చు. ఇలా ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. కానీ ఆమె భర్తను చంపడమే ఆప్షన్ అనుకుంది. ఇప్పుడామెకు జైలు జీవితమే గతి. నిన్నటి వరకూ ఒకరకమైన జీవితం... ఇప్పుడంతా చీకటి. ఆ ఇద్దరు కొడుకులు కూడా మనస్శాంతిగా ఉండలేరు. జరిగిన ఘటన వాళ్లనూ బాధిస్తూనే ఉంటుంది. అందుకే ఆవేశంలో నిర్ణయాలు ఏమాత్రం కరెక్టు కాదు అంటున్నారు పోలీసులు.
Published by: Krishna Kumar N
First published: December 16, 2019, 7:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading