భార్యాభర్తల బంధం (Wife And Husband Relation) అంటే నూరేళ్లపాటు కలిసి మెలసి ఉంటారని అందరూ భావిస్తారు. కానీ కొన్ని కాపురాలకు పూర్తిగా కలహాలతో నిండిపోతుంటాయి. అభిప్రాయబేధాలతో భార్యభర్తల మధ్య వివాదాలు రేగుతుంటాయి. కొందరు విడాకులు తీసుకొంటుంటే కొందరు కలహాల కాపురాన్నే కొనసాగిస్తుంటారు. అలా కలహాలతో నిండిన ఓ జంట జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఏమైందో ఏమో కట్టుకున్న భర్తను గొడ్డలితో దారుణంగా నరికి హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari) తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపతిపురంకు చెందిన విశ్వానథపల్లి అప్పారావుకు.. ఐ.పోలవరం మండలం కొమరగిరికి చెందిన దేవితో 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. ఐతే కొన్నేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
దీంతో భార్యభర్తలిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవలు జరుతుండటంతో ఇటీవల పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. గ్రామపెద్దలు, పోలీసులు వారి రాజీ కుదిర్చారు. ఐతే ఈ గొడవ విషయం అప్పారావు పనిచేసే చోట తెలియడంతో అతడ్ని తొలగించారు. అప్పటి నుంచి అప్పారావు ఇంటివద్దే ఉంటున్నారు.
ఉద్యోగం పోవడంతో ముదిగిన కలహాలు
అప్పారావు ఉద్యోగం పోవడంతో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. నీవల్లే ఉద్యోగం పోయిందంటూ భార్యను నిందిచడం మొదలుపెట్టడంతో మళ్లీ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున భార్య దేవి.. అప్పారావును గొడ్డలితో నరికి హత్య చేసింది. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం దేవి అక్కడి నుంచి పరారైంది. ఘటానస్థలిని పరిశీలించిన పోలీసులు హత్య కేసు నమోదు చేసి దేవి కోసం గాలిస్తున్నారు. తండ్రి హత్యకు గురవడం, తల్లి పరారీలో ఉండటంతో పిల్లలు ఒంటరివారయ్యారు.
అత్తను చంపిన కోడలు..
ఇటీవల గుంటూరు జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగింది. తెనాలి గంగానమ్మపేటలోని ప్యారడైజ్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న తాడికొండ మైథిలి(53) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసున్న పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్త మైథిలి వేధింపులు తట్టుకోలేక కోడలు రాధా ప్రియాంక హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పెళ్లైనప్పటి నుంచి అత్తాకోడళ్లకు అస్సలు పడటం లేదు. కోడలిపై ఆధిపత్యం చెలాయించేందుకు వేధిస్తున్నదన్న కోపంతో కోడలు దారుణంగా హత్య చేసింది. ఇంట్లో మైథిలి నిద్రపోతున్న సమయంలో ఆమెపై కోడలు ప్రియాంక కూరగాయలు తరిగే చాకు, చపాతి కర్రతో దారుణంగా పొడిచి హత్య చేసింది. హత్య జరిగిన రోజు అత్తాకోడళ్ల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న టూటౌన్ పోలీసులు ఆమెపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, East Godavari Dist, Guntur, Wife kill husband