WIFE KILLED HIS HUSBAND WITH LOVER AND LIES BEFORE POLICE BUT FINALLY AGREED THE FACT AK
Shocking Incident: నా భర్తను ఎవరో హత్య చేశారు.. వెక్కి వెక్కి ఏడ్చిన భార్య.. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్..
ప్రతీకాత్మక చిత్రం
నేరం చేసిన తర్వాత నిందితుడు మోహన్పాల్ నేరానికి ఉపయోగించిన కత్తి, రక్తపు మరకల దుస్తులను ఢిల్లీలోని సాకేత్‌లోని కాలువలో విసిరాడు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యను పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే ఛేదించారు. హత్యకేసులో మృతుడి భార్య, ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండేది. పోలీసుల సుదీర్ఘ విచారణలో నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. రాజధానిలోని ఆగ్నేయ జిల్లాలో తన భర్తను హత్య చేసిన కేసులో స్వర్ణాలి ఘోష్ అనే మహిళను ఆమె ప్రియుడు మోహన్పాల్ అలియాస్ శాంతున్తో కలిసి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మే 13న ఢిల్లీలోని కల్కాజీలోని ఓ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తికి సంబంధించి కల్కాజీ పోలీస్ స్టేషన్‌కు పీసీఆర్ కాల్ వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది, మెడపై కత్తితో మంచంపై తలకిందులుగా పడి ఉన్న వ్యక్తి కనిపించాడు. అనంతరం క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఫొటోలు తీశారు. మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు.
ఈ హత్యకు సంబంధించి కల్కాజీలో సెక్షన్ 302/34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ సందర్భంగా సమీపంలో అమర్చిన అన్ని సీసీటీవీ కెమెరాలను పోలీసు బృందం తనిఖీ చేసింది. ఈ బృందం కేసు దర్యాప్తులో ఇన్ఫార్మర్లను కూడా చేర్చింది. స్థానిక ఇంటెలిజెన్స్‌ను కూడా సేకరించారు. మొదట తన భర్తను ఎవరో చంపారని చెప్పిన మృతుడి భార్య.. ఆ తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారించిన అనంతరం తాను చేసిన నేరాన్ని అతడి భార్య ఒప్పుకుంది. తన ప్రియుడు మోహన్పాల్ అలియాస్ శాంతున్తో కలిసి తన భర్తను హత్య చేసినట్లు ఆ మహిళ వెల్లడించింది.
అనంతరం అరెస్టు నుండి తప్పించుకోవడానికి ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని తన స్వస్థలానికి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే ఆమె ప్రియుడు మోహన్పాల్ అలియాస్ శాంతున్ మొబైల్ ఫోన్ లొకేషన్‌ను పోలీసు బృందం గుర్తించింది. దీంతో పోలీసులు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మోహన్పాల్ అలియాస్ శాంతున్ వయస్సు 35 ఏళ్లుగా గుర్తించారు. నిందితుడు కూడా తన నేరాన్ని అంగీకరించాడు. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత నేరానికి ఉపయోగించిన రక్తపు మరకలతో కూడిన బట్టలు స్వాధీనం చేసుకున్నారు. నిరంతర విచారణలో నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు.
అంతేకాకుండా మోహన్పాల్తో తనకు గత రెండేళ్లుగా అక్రమ సంబంధాలు ఉన్నాయని నిందితురాలు స్వర్ణలి చెప్పింది. స్టార్ మేకర్ యాప్‌లో తాను ఔత్సాహిక గాయకుడినని వెల్లడించాడు. తన భర్త తనను తరచూ కొట్టేవాడని మహిళ చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆమె ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది. నేరం చేసిన తర్వాత నిందితుడు మోహన్పాల్ నేరానికి ఉపయోగించిన కత్తి, రక్తపు మరకల దుస్తులను ఢిల్లీలోని సాకేత్‌లోని కాలువలో విసిరాడు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.