భర్తను చంపి నోట్లో యాసిడ్ పోసిన భార్య.. హైదరాబాద్‌లో దారుణం

నర్సింహులు మెడ, తల భాగంలో గాయాలు కనిపించడంతో పోస్టుమార్టం చేయించారు పోలీసులు. వారు అనుమానించినట్లుగానే పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి.

news18-telugu
Updated: September 24, 2019, 9:29 PM IST
భర్తను చంపి నోట్లో యాసిడ్ పోసిన భార్య.. హైదరాబాద్‌లో దారుణం
కానీ, దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, వారి నుంచి బెదిరింపులు అధికం కావడంతో తట్టుకోలేని కడల్‌కన్ని ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది.
  • Share this:
మద్యానికి బానిసైన భర్తను అతడి భార్య దారుణంగా హత్యచేసింది. భర్త తలపై కర్రతో కొట్టి, అనంతరం గొంతుకు నైలాన్ తాడు బిగించి చంపేసింది. తన తమ్ముడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పెద్ద ప్లానే వేసింది. శవం నోట్లో యాసిడ్ పోసి సూసైడ్ చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలడంతో అక్కాతమ్ముడిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో జరిగిన ఈ ఘటన తీవ్రం కలకలం రేపింది. సెప్టెంబరు 19న జరిగిన ఈ హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రాయదుర్గం మధురానగర్‌కు చెందిన నర్సింహులు(43), సునీత (40) దంపతులు కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఐతే భర్త తాగుడుకు బానిసై భార్యను నిత్యం వేధించేవాడు. వచ్చిన డబ్బును మద్యం తాగేందుకే ఖర్చుపెట్టేవాడు. ఇదేంటని నిలదీసినందుకు భార్యను కొట్టేవాడు. భర్త టార్చర్‌ని భరించలేకపోయిన సునీత.. అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. అదే ప్రాంతంలో ఉండే తన తమ్ముడు సద్దుల శ్రీనివాస్ (34)తో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది.

తమ పథకంలో భాగంగా ఈ నెల 19న శ్రీనివాస్‌ను ఇంటికి పిలిపించింది సునీత. అప్పటికే తాగిన మైకంలో ఉన్న నర్సింహులుపై అక్కాతమ్ముడు కర్రతో దాడి చేశారు. సంపులో నీటిని తోడే బకెట్‌కు ఉన్న నైలాన్ తాడు తీసుకొని అతడి మెడకు బిగించి చంపేశారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భర్త డెడ్‌బాడీ నోట్లో యాసిడ్ పోశారు. మరుసటి రోజు తనకు ఏమీ తెలియనట్లుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది సునీత. కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నాడని.. ఆ బాధను భరించలేక యాసిడ్ తాగి సూసైడ్ చేసుకున్నాడని చెప్పింది.

ఐతే నర్సింహులు మెడ, తల భాగంలో గాయాలు కనిపించడంతో పోస్టుమార్టం చేయించారు పోలీసులు. వారు అనుమానించినట్లుగానే పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి. నైలాన్‌ తాడును బిగించడం వల్లే చనిపోయాడని.. అతడు మరణించిన తర్వాతే యాసిడ్ తాగించారని తేలింది. దాంతో మృతుడి భార్యను పిలిపించి తమైదన స్టైల్లో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. నేరాన్ని అంగీకరించడంతో సునీతతో పాటు ఆమె తమ్ముడు శ్రీనవాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.
First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading