కూతురు పెళ్లి వివాదం కారణంగా ఆ దంపతులిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఆ వివాదాలు చివరకు భార్య భర్తను హత్య చేసే వరకు వెళ్లాయి. ఇటీవల తన భర్తను తానే హత్య చేసి ఎవరో చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అయితే కేసు విచారణను సీరియస్గా తీసుకున్న పోలీసులు... మృతుడి భార్యే అతడిని హత్య చేసిందని తేల్చారు. వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం గురందొరపాలెంకు చెందిన చిరంజీవి, సన్యాసమ్మలు ఇటీవల తమ చిన్న కూతురు పెళ్లి చేశారు. అయితే చిన్నకూతురు అత్త, మామ వేర్వేరు కులాలకు చెందిన వారని తెలిసి ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.
కూతురిని ఏడాది పాటు ఇంటికి రావొద్దని చిరంజీవి తన భార్యకు తెగేసి చెప్పాడు. దీంతో భర్తను హత్య చేయాలని భావించిన సన్యాసమ్మ... ఈ నెల 15న తన పాకలోనే కత్తితో భర్త మెడపై దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఎవరో తన భర్తను చంపేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు... కూరగాయలు కోసేందుకు వినియోగించే కత్తి పాక దగ్గర దొరకడంతో సన్యాసమ్మను విచారించి ఆమెను అసలు దోషిగా తేల్చారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.