హోమ్ /వార్తలు /క్రైమ్ /

విశాఖలో దారుణం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య: అల్లుడిని చంపిన మామ: ఎందుకో తెలుసా?

విశాఖలో దారుణం భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య: అల్లుడిని చంపిన మామ: ఎందుకో తెలుసా?

భర్తను హత్య చేసిన భార్య

భర్తను హత్య చేసిన భార్య

క్షణికావేశంలో కొందరు మనుషులం అనే సంగతి మరిచిపోతున్నారు. విశాఖలో శుక్రవారం ఉదయం రెండు దారుణ హత్యలు జరిగాయి. అనుమానంతో భర్తను రోకలి బండతో భార్య దారుణంగా హత్య చేస్తే.. మరోచోట మద్యం మత్తులో అల్లుడ్ని హత్య చేశాడు మామ.

విశాఖలో దారుణం జరిగింది.  అనుమానంతో భార్యను చంపిన భర్త అనే వార్తలు తరచూ వింటూ ఉంటూటాం.. కానీ ఇటీవల భర్తలను చంపిన భార్యల సంఖ్య కూడా పెరుగుతోంది. అది కొందరైతే మరీ చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్నారు. మరికొందరు ప్రియుడి మోజులో పడి భర్తలను కిరతకంగా హత్యలు చేస్తున్నారు.. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి.

తాజాగా విశాఖపట్నంలో భర్తపై అనుమానంతో భార్య రోకలిబండతో అతి దారుణంగా కొట్టి చంపింది. ఈ ఘటన ఏవీఎన్‌ కాలేజీ ద్వారం వీధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. భార్యభర్తల  మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు అంటున్నారు. ఆ గొడవలే వివాదంగా మారి హత్యకు దారి తీసి ఉంటుందంటున్నారు. .

స్థానికులు, పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం భర్త పుండరీ కాక్షయ్య పిల్లలను చంపేస్తాడనే భయంతోనే భర్తను హత్య చేసినట్లు భార్య పుణ్యవతి అంటోంది అంటున్నారు. హత్య గురించి తెలిసిన వెంటానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహిటిన  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

కేవలం క్షణికావేశంలోనే ఆమె భర్తను హత్య చేసిందా. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మాత్రం ప్రతి నిత్యం వారి ఇంట్లో గొడవలు జరుగుతుండేవి అని అంటున్నారు. అయితే కేవలం పుణ్యవతి  మాత్రమే హత్య చేసిందా? భర్తను హత్య చేయమని ఎవరైనా ప్రోత్సహించారా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు..

అయితే విశాఖలోనే మరో దారుణం చోటు చేసుకుంది.  పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో  మద్యం మత్తులో అల్లుడిని మామ కొట్టి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మామ శంకర్‌, అల్లుడు చిన్నా మధ్య మద్యం మత్తులో ఘర్షణ  చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాటకు మాటా పెరిగి.. గొడవకు దారి తీసింది. దీంతో  కోపోద్రేకంలో రాడ్‌తో కొట్టి అల్లుడు చిన్నను మామ శంకర్‌ హత్య చేశాడు. అలాగే హత్య చేసిన మామ శంకర్ తో  పాటు ఆ గొడవకు కారణమైన బావ మరిది అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం మద్యం సేవించి ఉండడంతో క్షణికావేశంలోనే హత్య చేశాడా? రెండు కుటుంబాల మధ్య పాత వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Crime, Crime news, Crime story, Visakha, Visakhapatnam

ఉత్తమ కథలు