Home /News /crime /

WIFE KILLED HER HUSBAND BECAUSE OF EXTRA MARITAL AFFAIR WITH ANOTHER PERSON AK

Illegal Affair: ప్రియుడితో మహిళ వివాహేతర సంబంధం.. హఠాత్తుగా వచ్చిన భర్త.. తరువాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Extra Marital: పెళ్లికి ముందే మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తమకు అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించింది.

    వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఎంతో ఆశతో తన కొడుకును చూసేందుకు వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసి మరీ చంపించింది ఓ మహిళ. భార్య కుట్రను గమనించలేకపోయిన ఆ వ్యక్తి.. దారుణ హత్యకు గురయ్యాడు. కర్ణాటకలోని ధార్వాడ జిల్లా హుబ్లీ తాలూకా అంచటగేరిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే వ్యక్తి హత్యకు కారణమైన అతడి భార్యతోపాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

    వివరాల్లోకి వెళితే.. హుబ్లీ తాలూకా అంచటగేరి నివాసి అక్షతకు హావేరి జిల్లా హానగల్‌ నివాసి జగదీష్‌తో ఏడాది క్రితం పెళ్లి జరిగింది. ఆ తరువాత తన భార్య గర్భం దాల్చడంతో.. వేరే పనుల నిమిత్తం జగదీష్ వేరే ప్రాంతానికి వెళ్లాడు. నాలుగు నెలల క్రితం అక్షత మగబిడ్డకు జన్మించింది. భార్య, బిడ్డలను చూసేందుకు వచ్చిన జగదీష్ అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో.. పోలీసులు ఈ కేసుపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. అక్షిత కాల్ డేటాను పరిశీలించి.. అదే గ్రామంలో లైన్‌మెన్‌గా పని చేస్తున్న కాశప్పను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో జగదీష్ మర్డర్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది.

    అక్షతకు కాశప్పకు గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నెలకొంది. ఇక నాలుగు నెలల క్రితం కాశప్పకు మరో యువతితో వివాహమైంది. తమ వివాహేతర సంబంధం కొనసాగాలంటే అడ్డుగా ఉన్న జగదీష్‌ను చంపేయాలని అక్షిత, కాశప్ప ప్లాన్ చేశారు. ఆ క్రమంలోనే భార్య, బిడ్డను చూసేందుకు వచ్చిన జగదీష్‌కు కాశప్ప మందుపార్టీ ఇచ్చి ఊరు బయటకు తీసుకెళ్లి తలపై బండరాయిని ఎత్తి వేసి హత్య చేశాడు. కాశప్పను తమదైన శైలిలో విచారించి వాస్తవాలు రాబట్టిన పోలీసులు.. అక్షితతో పాటు కాశప్పను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Extramarital affairs, Illegal affair, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు