WIFE INSTALLS SPY CAM TO CATCH HER HUSBAND WITH LOVER GETS BOOKED BS
భర్త బాగోతాలను కనిపెట్టాలని కెమెరా పెట్టి.. అడ్డంగా బుక్కైన మహిళ..
ప్రతీకాత్మక చిత్రం
కట్టుకున్న భర్త వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడు.. తనకు తెలిసినా అందరి ముందు నిరూపించలేకపోయింది.. ఎలాగైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని బెడ్రూంలో కెమెరా పెట్టింది. కానీ, తానే అడ్డంగా బుక్కై కటకటాల పాలైంది.
కట్టుకున్న భర్త వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడు.. తనకు తెలిసినా అందరి ముందు నిరూపించలేకపోయింది.. ఎలాగైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని బెడ్రూంలో కెమెరా పెట్టింది. కానీ, తానే అడ్డంగా బుక్కై కటకటాల పాలైంది. వివరాల్లోకెళితే.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన మహిళ(33) కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, వారిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. 2016లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నా ఒకే ఇంట్లో కలిసే ఉన్నారు. అయితే, ఆలోగా భర్త తన లవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన మహిళ.. వాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాలని ప్లాన్ వేసింది. తన లాయర్‌తో చెప్పి బెడ్రూంలో స్పై కెమెరా ఏర్పాటు చేసింది. పలు సందర్భాల్లో తన భర్త, లవర్ కలిసి సెక్స్ చేసుకున్న వీడియోలను సేకరించింది.
ఆ వీడియోలతో భర్తను బెదిరించి తొందరగా విడాకులు వచ్చేలా చేయాలని, తాను అడిగినంత భరణం ఇవ్వాలని.. లేకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరించింది ఆ మహిళ. ఆమె తరఫు లాయర్ కూడా ఆ వీడియోలతో భర్త లవర్‌కు ఆ వీడియోలు చూపించి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. అయితే, ఆమె ఏ మాత్రం భయపడకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన ప్రైవసీని దెబ్బతీసేలా వీడియోలు తీశారని మహిళ, ఆమె తరఫు లాయర్, మరో ఇద్దరిపై కేసు పెట్టింది.
పోలీసులు.. సెక్షన్లు 354, 507, 120 కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. తన భర్తను పట్టిద్దామనుకున్న భార్యకు.. అతడి లవర్ షాక్ ఇవ్వడంతో ఆమె ఖంగుతిన్నది. అయితే.. లాయర్ మాత్రం తనను అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తనపై మోపిన ఆరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేశాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.