Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భార్య ఇలా చేస్తుందని ఆ భర్త కలలో కూడా ఊహించి ఉండడు..!

ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భార్య ఇలా చేస్తుందని ఆ భర్త కలలో కూడా ఊహించి ఉండడు..!

వివారాల్లోకి వెళితే... నగరంలోని షాహినగర్‌కు చెందిన  అక్బర్​ఖాన్​, సంతోష్​నగర్​కు చెందిన మహ్మద్​ ఈషా అలీ ఇద్దరు మంచి స్నేహితులు. అయితే అక్బర్​ఖాన్​ గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. 
ప్రతీకాత్మకచిత్రం

వివారాల్లోకి వెళితే... నగరంలోని షాహినగర్‌కు చెందిన అక్బర్​ఖాన్​, సంతోష్​నగర్​కు చెందిన మహ్మద్​ ఈషా అలీ ఇద్దరు మంచి స్నేహితులు. అయితే అక్బర్​ఖాన్​ గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రతీకాత్మకచిత్రం

తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో జనవరి 11న చనిపోయిన ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి వెనకున్న మిస్టరీని పోలీసులు చేధించారు. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన జక్కలి రామకృష్ణ గుండెపోటుతో చనిపోలేదని...

నల్గొండ: తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో జనవరి 11న చనిపోయిన ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి వెనకున్న మిస్టరీని పోలీసులు చేధించారు. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన జక్కలి రామకృష్ణ గుండెపోటుతో చనిపోలేదని, అతని భార్య తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌తో హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సర్వారం గ్రామానికి చెందిన రామకృష్ణ అదే గ్రామానికి చెందిన మమత ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. రామకృష్ణకు తిప్పర్తిలో మొబైల్ షాప్ ఉంది. దాంతో పాటు.. చిట్టీల వ్యాపారం చేసుకుంటున్న రామకృష్ణకు ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు లేవు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో కలిసి సంతోషంగా జీవించాల్సింది పోయి మమత తప్పుదోవ పట్టింది. రామకృష్ణ తన స్నేహితుడైన రాజశేఖర్‌‌పై నమ్మకంతో అప్పుడప్పుడూ ఇంటికి తీసుకెళ్లేవాడు. అందరూ కలిసి భోజనం చేసేవారు. ఈ క్రమంలోనే రాజశేఖర్, మమత మధ్య పరిచయం ఏర్పడింది. రామకృష్ణ ఇంట్లో లేని సమయంలో రాజశేఖర్ అప్పుడప్పుడూ మమతను కలిసేందుకు ఇంటికి వెళ్లేవాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. రాజశేఖర్‌ను దూరం పెట్టాడు.

అయినా వీరిద్దరి తీరులో మార్పు రాలేదు. తమ బంధానికి రామకృష్ణ అడ్డుతగులుతున్నాడని భావించిన మమత, ఆమె ప్రియుడు రాజశేఖర్ అతనిని అంతమొందించాలనుకున్నారు. అందుకు పక్కాగా ప్లాన్ చేసి.. జరిగిందంతా మర్చిపోదామని రామకృష్ణకు చెప్పిన రాజశేఖర్ పూటుగా మద్యం తాగించాడు. అప్పటికే ప్లాన్ ప్రకారం.. మమత రాత్రి తన పిల్లలకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి తాగించింది. ఆ రాత్రి మద్యం మత్తులో ఉన్న రామకృష్ణను మమత, రాజశేఖర్ కలిసి హత్య చేశారు. రామకృష్ణ జననాంగాలను పిసికి దారుణానికి ఒడిగట్టారు. ఆపై రామకృష్ణ మృతదేహాన్ని బాత్రూమ్‌లో తీసుకెళ్లి పడేశారు. గుండెపోటుతో తన భర్త చనిపోయినట్లు మమత అందరినీ నమ్మించింది. అయితే.. ఇటీవల ఆస్తి విషయంలో మమతకు, అత్తమామలకు తగాదా జరిగింది.

ఈ క్రమంలోనే.. తీవ్ర అసహనానికి గురైన మమత మీ అబ్బాయిని చంపినట్లే మిమ్మల్ని కూడా హత్య చేయిస్తానని బెదిరించింది. మమత అసలు నిజం కక్కేయడంతో రామకృష్ణ తల్లిదండ్రులు తమ కొడుకు మృతిపై అనుమానాలున్నాయని ఎస్పీ ఏ.వి.రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు ఈ కేసును విచారించగా మమత గుట్టు బయటపడింది. మమత, ఆమె ప్రియుడు రాజశేఖర్ మధ్య జరిగిన కాల్ సంభాషణలను పరిశీలించిన పోలీసులు రామకృష్ణది హత్యగా నిర్ధారించారు.

First published:

Tags: Crime news, Illegal affair, Nalgonda, Wife kill husband

ఉత్తమ కథలు