Home /News /crime /

WIFE ILLEGAL AFFAIR LEADS TO DEATH OF HER HUSBAND IN KARIMNAGAR DISTRICT SSR

KarimNagar: మా ఆయన కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్‌కు భార్య.. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పనికి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే.. కనిపించకుండాపోయిన ఆ భర్త కొన్ని రోజులకు శవమై తేలాడు. ఆ భర్త మృతి వెనుక ఉంది భార్యేనని...

    కరీంనగర్: పనికి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాలేదని పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే.. కనిపించకుండాపోయిన ఆ భర్త కొన్ని రోజులకు శవమై తేలాడు. ఆ భర్త మృతి వెనుక ఉంది భార్యేనని తెలిసి పోలీసులు విస్మయం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసే రాజయ్య(35), లత భార్యాభర్తలు. రోజూలానే పనికి వెళ్లిన రాజయ్య ఫిబ్రవరి 5న పని ముగించుకుని ఇంటికి రాలేదు. తన భర్త కనిపించడం లేదంటూ లత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ నెల 7న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 16న మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.

    దీంతో.. రాజయ్య కుటుంబీకులను అక్కడికి తీసుకెళ్లి చూపించగా.. ఆ శవం రాజయ్యదేనని గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆటోడ్రైవర్ ఎనగండుల బాబుపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అతనిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు బాబు అసలు విషయం చెప్పాడు. రాజయ్య భార్యతో తనకు వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. రాజయ్యను అడ్డు తొలగించాలని లత కోరడంతో ఫిబ్రవరి 5న కల్లు తాగుదామని అతనిని ఆటోలో తీసుకెళ్లానని, కల్లు తాగాక చంపడం వీలుకాకపోవడంతో తిరిగి తీసుకువచ్చానని చెప్పాడు.

    ఈలోపు.. దారి మధ్యలో ఉండగా లత ఫోన్ చేసి చంపేయాలని పట్టుబట్టిందని నిందితుడు చెప్పాడు. ఇక.. ఆమె మాట ప్రకారమే రాజయ్యను ఆటోలో ముంజంపల్లి కెనాల్ వద్దకు తీసుకెళ్లి.. మళ్లీ కల్లు తాగించానని.. ఆ తర్వాత మెడపై బలంగా కొట్టడంతో రాజయ్య కిందపడ్డాడని బాబు చెప్పాడు. తర్వాత కెనాల్‌లోకి నెట్టేసి ఇంటికెళ్లిపోయానని నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు లత, బాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Illegal affair, Karimnagar, Murder, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు