Wife: ఈ కారణంతో భర్తకు దూరమైన భార్యవి నువ్వేనేమో తల్లీ.. ఇలా చేయకుండా ఉండాల్సింది..

అంజలి (ఫైల్ ఫొటో)

అంజలి, శుభమ్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. శుభమ్ కోటలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ భార్యను చూసుకుంటున్నాడు. వీరిద్దరికీ వివాహమై రెండేళ్లయింది.

 • Share this:
  కోట: ఈరోజుల్లో చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రాలేదనో, భర్త తనకు నచ్చినట్టుగా ఉండటం లేదనో.. ఇలా ఆలుమగల మధ్య గొడవలు తలెత్తిన సందర్భంలో క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కొందరు చేజేతులా నూరేళ్ల జీవితానికి అర్థాంతరంగా ముగింపు పలుకుతున్నారు. మానసిక ఒత్తిడికి లోనై మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు.

  ఇలాంటి విషాద ఘటనే రాజస్థాన్‌లోని కోట జిల్లాలో వెలుగుచూసింది. భర్త తాను చెప్పిన చొక్కా ధరించలేదని భార్య మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కోట ప్రాంతంలోని ఆర్‌కేపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో అంజలి, శుభమ్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. శుభమ్ కోటలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ భార్యను చూసుకుంటున్నాడు. వీరిద్దరికీ వివాహమై రెండేళ్లయింది. అంజలి ఇటీవల అనారోగ్యానికి లోనైంది. తలనొప్పి, కడుపు నొప్పితో ఆమె ఇబ్బంది పడుతోందని అంజలి భర్త చెప్పాడు. ఈ క్రమంలో.. ఆమె ప్రవర్తన కొంచెం ఇబ్బందికరంగా అనిపించిందని తెలిపాడు.

  ఇది కూడా చదవండి: Sad: అయ్యో పాపం.. భర్త ఇంకా ఇంటికి రాలేదేంటని కాల్ చేస్తే బయటే రింగ్ అయింది.. తీరా చూసేసరికి..

  గత మంగళవారం ఉదయం శుభమ్ బయటకు వెళుతున్న సందర్భంలో తనకు నచ్చిన షర్ట్ ధరించాలని అంజలి కోరింది. అందుకు శుభమ్ నిరాకరించాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది. భార్యపై అసహనం వ్యక్తం చేస్తూ శుభమ్ ఖాళీ కడుపుతో ఏమీ తినకుండానే డ్యూటీకి వెళ్లిపోయాడు. భర్త ప్రవర్తనతో అంజలి తీవ్ర మనస్తాపం చెందింది. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంది. ఇక తాను బతికి ఉండకూడదని, ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. శుభమ్ డ్యూటీ నుంచి ఇంటికొచ్చేసరికి అంజలి అనుకున్నంత పనీ చేసింది. శుభమ్ డ్యూటీ నుంచి తిరిగొచ్చేసరికి అంజలి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యను అలా విగతజీవిగా చూసి ఆమె భర్త దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.

  ఇది కూడా చదవండి: Strange: ఇలాంటి పెళ్లిని మీరెప్పుడూ చూసి ఉండరేమో.. కానీ ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు..!

  డ్యూటీకి వెళ్లాక కూడా తాను ఫోన్‌లో భార్యతో మాట్లాడానని, ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని శుభమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంజలి తండ్రి మాట్లాడుతూ.. కూతురు, అల్లుడు గొడవ పడటం తామెప్పుడూ చూడలేదని, అంజలి ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదని కన్నీరుమున్నీరయ్యాడు. అంజలి డిగ్రీ చదువుకుంది. చదువుకున్న యువతి అయి ఉండి ఇంత చిన్న విషయానికే ఆత్మహత్యకు పాల్పడటం శోచనీయం. పోలీసులు ఈ ఘటనపై సమాచారం అందుకుని స్పాట్‌కు చేరుకున్నారు. అంజలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
  Published by:Sambasiva Reddy
  First published: