Home /News /crime /

WIFE GIVES MONEY TO OTHER PERSON TO MURDER HIS HUSBAND REVEALS FACT IN POLICE INVESTIGATION AK

Wife Murder Plan: భర్త హత్యకు భార్య ప్లాన్.. అంతా అనుకున్నట్టే జరిగిందనుకున్న సమయంలో...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Wife: నాగ్‌పూర్‌కు చెందిన ప్రదీప్ బగ్డే కొన్నేళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి అతడు చనిపోయాడు. మొదట ఈ హత్యకు భూ వివాదాలే కారణమని భావించిన పోలీసులు.. దొరికిన నిందితులు కూడా అదే రకమైన సమాధానం ఇవ్వడంతో కేసు కొలిక్కి వచ్చిందని అనుకున్నారు.

ఇంకా చదవండి ...
    నాగ్‌పూర్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య జరిగింది. చనిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో భూ వివాదాలే ఈ గొడవకు కారణమని అంతా అనుకున్నారు. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ చేపట్టారు. నిందితుడు కూడా దొరికాడు. హత్యకు కారణం భూ వివాదమే అని చెప్పాడు. కానీ పోలీసులు ఎందుకో అతడు చెప్పిన విషయాలు నమ్మశక్యంగా అనిపించలేదు. కట్ చేస్తే వేరే కోణంలో విచారణ చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో అసలు సూత్రధారి ఎవరనే విషయాన్ని తేల్చారు. వివారాల్లోకి వెళితే నాగ్‌పూర్‌కు చెందిన ప్రదీప్ బగ్డే కొన్నేళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి అతడు చనిపోయాడు. మొదట ఈ హత్యకు భూ వివాదాలే కారణమని భావించిన పోలీసులు.. దొరికిన నిందితులు కూడా అదే రకమైన సమాధానం ఇవ్వడంతో కేసు కొలిక్కి వచ్చిందని అనుకున్నారు.

    కానీ మరో కోణంలో కేసు విచారణ చేపట్టి మృతుడు ప్రదీప్ బగ్డే భార్య రోషిణి(పేరు మార్చాం) అతడి హత్యకు ప్లాన్ చేసిందని తేల్చారు. ప్రదీప్ బగ్డే ఇంట్లో హత్య కేసు నిందితుడు పవన్ చౌదరి అద్దెకు ఉంటున్నాడు. అతడే ఈ హత్య చేసినట్టు విచారణలో అంగీకరించాడు. భూవివాదాలే హత్యకు కారణమని పోలీసులకు చెప్పాడు. కానీ మృతుడు నిందితుడికి మధ్య ఎలాంటి భూ వివాదాలు లేవని గుర్తించిన పోలీసులు.. మరో యాంగిల్‌లో కేసు విచారణ చేపట్టారు.

    అప్పుడు కానీ వారికి ఈ హత్య కేసులో అసలు సూత్రదారి మృతుడు ప్రదీప్ బగ్డే భార్య రోషిణి అని అర్థంకాలేదు. భర్తతో తరుచుగా గొడవపడే రోషిణి.. అతడిని హత్య చేసేందుకు నిందితుడు పవన్ చౌదరికి మూడు లక్షల రూపాయలు సుపారీగా ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా సేకరించారు.

    అయితే అసలు తన భర్తను చంపేందుకు పవన్‌కు రోషిణి డబ్బు ఎందుకు ఇచ్చిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. రోషిణికి, పవన్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏమైనా ఉందా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రదీప్‌ను హత్య చేసేందుకు పవన్‌కు సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news, Wife kills husband

    తదుపరి వార్తలు