పెళ్లి చూపుల్లో కోరిన కోరిక.. తీర్చలేకపోతున్నాడంటూ భర్తకు విడాకుల నోటీసులు పంపిన భార్య.. అసలు కథేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

తన కోరికను తీర్చలేని భర్తతో జీవితాంతం కలిసి ఉండలేననీ, తనకు విడాకులు ఇవ్వాల్సిందేనని కోరుతోంది. అయితే భార్య అసమర్ధత వల్లే తాను ఆ హామీని నెరవేర్చలేకపోతున్నానని అతడు వాపోతున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందా..? అనే కదా మీ డౌటు.

 • Share this:
  ఓ విచిత్ర కారణంతో భర్తతో విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కిందో భార్య. పెళ్లి చూపుల్లో తనకు ఓ హామీ ఇచ్చాడనీ, ఆ హామీని నెరవేర్చకుండా తప్పించుకుంటున్నాడన్నది ఆమె ఆరోపణ. తన కోరికను తీర్చలేని భర్తతో జీవితాంతం కలిసి ఉండలేననీ, తనకు విడాకులు ఇవ్వాల్సిందేనని కోరుతోంది. అయితే ఆ భర్త చెప్పేది మాత్రం వేరుగా ఉంది. పెళ్లి నాడు చేసిన హామీకి తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాననీ, భార్య అసమర్ధత వల్లే తాను ఆ హామీని నెరవేర్చలేకపోతున్నానని అతడు వాపోతున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందా..? అనే కదా మీ డౌటు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ ఫ్యామిలీ కోర్టులో నమోదైన ఈ విచిత్ర కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భోపాల్ లోని అరేరా హిల్స్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తికి రెండున్నరేళ్ల క్రితం బ్యాంకు ఉద్యోగం చేస్తున్న ఓ మహిళతో పెళ్లయింది.

  పెళ్లి చూపుల్లో ఆ మహిళ ఓ కోరిక కోరింది. ’నాకు చదువుకోవాలన్న ఆశగా ఉంది. ఆస్ట్రేలియాలో నాకు బాగా నచ్చిన యూనివర్శిటీలో చదువుకోవాలన్నదే నా డ్రీమ్. దాన్ని మీరు తీర్చాలి.‘ అని ఆ మహిళ అంది. దానికి అతడు కూడా సరేనన్నాడు. ’మీ కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తా‘ అన్నాడు. దీంతో వారిద్దరి పెళ్లి ఘనంగానే జరిగింది. ఆ భర్త హామీ ఇచ్చినట్టుగానే ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు సంబంధించిన ప్రవేశ పరీక్షను భార్యతో రాయించాడు. కానీ ఆ పరీక్షలో భార్య ఫెయిల్ అయింది. దీంతో జర్మనీ కానీ, నెదర్లాండ్స్ లో కానీ అదే చదువును అందించే యూనివర్శిటీలు ఉన్నాయనీ, ఖర్చు కూడా ఆస్ట్రేలియాతో పోల్చితే చాలా బాగా తక్కువని భర్త చెప్పాడు. ఆ రెండు దేశాల్లో ఏదో ఒక దేశానికి వెళ్లి చదువుకొమ్మనీ, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు.
  ఇది కూడా చదవండి: అతడికి 19 ఏళ్లు.. ఆమెకు 15 ఏళ్లు.. ఇళ్లల్లోంచి సడన్ గా మాయం.. కుటుంబ సభ్యుల్లో భయం భయం.. చివరకు చెరువులో ఇలా..

  అయితే ఆ భార్య మాత్రం ఊహించని రీతలో ఆ భర్తకు విడాకుల నోటీసులు పంపింది. తన భార్య తనకు విడాకుల నోటీసులు పంపడమేంటా అని అతడు మొదట ఆశ్చర్యపోయాడు. తనకు ఏమాత్రం చెప్పకుండానే ఆమె ఈ విడాకుల నోటీసులు పంపడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. భోపాల్ ఫ్యామిలీ కోర్టు వీరికి మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించింది. ఈ కౌన్సిలింగ్ లో ’నా భర్త పెళ్లి చూపుల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయాడు. నన్ను ఆస్ట్రేలియాలో నాకు నచ్చిన యూనివర్శిటీలో చదివిస్తానంటేనే నేను అతడిడితో ఉంటా. నా డ్రీమ్ కు అడ్డు వస్తున్న అతడు నాకు అవసరం లేదు.‘ అని ఆ భార్య తేల్చిచెప్పింది.
  ఇది కూడా చదవండి: అద్దెకుంటున్న భార్యాభర్తలు.. తలుపులు తీసే ఉండటంతో మాట్లాడేందుకు వెళ్తే కనిపించిన దృశ్యం చూసి ఆ యజమానికి..

  ’ఆస్ట్రేలియా పంపించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆమె ప్రవేశ పరీక్షనే పాసవ్వలేదు. ఆస్ట్రేలియాలో ఆ చదువుకు అయ్యే ఖర్చుతో పోల్చితే జర్మనీ, నెదర్లాండ్స్ లో అయితే సగం ఖర్చుతో విద్యాభ్యాసం పూర్తవుతుంది. అందుకే ఆ రెండు దేశాల్లో చదుకోమంటున్నాను. నా ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఆ మాట చెప్పాను. ఆమె ససేమిరా అంటే ఆస్ట్రేలియానే పంపిస్తాను. నాకు విడాకుల నోటీసులు పంపుతుందని నేను ఊహించలేదు. నేను ఆమెకు విడాకులు ఇవ్వదలచుకోలేదు. నా భార్య నాకు కావాలి‘ అంటూ ఆ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. మరో విడత కూడా కౌన్సిలింగ్ జరుపుతామనీ, భార్యాభర్తల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను పోగొట్టే ప్రయత్నం చేస్తామని వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన షైల్ అవస్తీ తెలిపారు.
  ఇది కూడా చదవండి: అర్ధరాత్రి.. రెండు గంటల సమయం.. గాఢ నిద్రలో ఉన్న తల్లిదండ్రులు.. ఆ 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని ఏం చేసిందంటే..
  Published by:Hasaan Kandula
  First published: